కమ్మ సీట్లలో ఇతరులు..జగన్‌ బిగ్‌ రిస్క్‌ చేస్తున్నారా?

రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మార్చడమే కాదు.. పార్టీ సంస్థాగత నిర్మాణాల్లో కూడా జగన్ మార్పులు చేస్తున్నారు.  జగన్ ప్రాధాన్యతాంశాలు ఎప్పకప్పుడు మారుతుంటాయి. ఇది పార్టీ ఆవిర్భావం నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. తనకు పార్టీ భవిష్యత్తే ముఖ్యం అని చాలా సందర్భాల్లో సీఎం జగన్ వ్యాఖ్యానించారు కూడా.

వాస్తవంగా మోజార్టీ నియోజవకర్గాల్లో అత్యధిక కులస్థులు బీసీలు, ఆ తర్వాత ఎస్సీలు ఉంటారు. కానీ రాజకీయంగా వారికి ప్రాధాన్యం అంతంతమాత్రంగానే ఉంటుంది. కొన్ని కొన్ని సీట్లు ప్రత్యేకంగా ఈ కులం అయితేనే గెలుస్తారు అనే ముద్ర పడింది. విజయవాడ కమ్మ సామాజిక వర్గం అయితేనే గెలుస్తారు. రాష్ట్ర ఆవిర్భావం ముందు ఆ తర్వాత కూడా ఇప్పటికీ అక్కడ కమ్మ సామాజిక వర్గ నేతలే పోటీలో ఉన్నారు. వైసీపీ కేశినేని నానికి, టీడీపీ ఆయన సోదరుడు కేశినేని చిన్నికి అవకాశం కల్పించింది.

కానీ మిగతా చోట్ల ఆ సంప్రదాయానికి వైఎస్ జగన్ ముగింపు పలికారు. రాజమండ్రి సీటును ఎక్కువగా కమ్మ సామాజిక వర్గ నేతలకు ఇస్తుంటారు. కానీ ఈ దఫా బీసీలకు కేటాయించారు. నర్సాపురం అంటే రాజులే గుర్తుకు వస్తారు. అక్కడ గతంలో వైసీపీ నుంచి రఘురామకృష్ణం రాజు గెలుపొందారు. ఆ తర్వాత పార్టీకి రెబల్ గా మారారు. కానీ ఈ సారి అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన శెట్టి బలిజ కులస్థులకు కేటాయించారు.

అలాగే ఏలూరులో  కమ్మ సామాజిక వర్గం చాలా బలంగా ఉంటుంది. కానీ ఈ సారి ఆస్థానాన్ని జగన్ బీసీలను నిల్చొబెట్టారు. గుంటూరు లో ఎప్పుడూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే రెండు పార్టీల నుంచి తలపడుతుంటారు. కానీ ఈ సారి ఆ స్థానాన్ని కాపు సామాజిక వర్గానికి కేటాయించారు.  అలాగే నర్సరావు పేట ను కూడా జనరల్ నుంచి బీసీకి మార్చడం ఇలా సంప్రదాయ సీట్లు అనే  చోట్ల అభ్యర్థులను, వర్గాలను మార్చడం రాజకీయంగా మేలు చేకూరుస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: