రేవంత్‌ పంతం.. కేసీఆర్‌పై సీబీఐ దర్యాప్తు తప్పదా?

తెలంగాణలో దశాబ్దకాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అక్రమాలు జరగలేదు అన్నట్లుగా చూపించారు. పోలీస్, ఏసీబీ, మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్న గులాబీ బాస్ తన పాలనలో జరిగిన అక్రమాలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. సీబీఐ రాష్ట్రంలో రాకుండా రహస్యంగా జీవో జారీ చేశారు. ఇక వందల జీవోలను ప్రభుత్వ వెబ్ సైట్లలో కనిపించకుండా జారీ చేశారు.

కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు కేసీఆర్ పాలనకు స్వస్తి పలికారు. కాంగ్రెస్ కు పట్టం కట్టారు. పదేళ్ల తర్వా త అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ బీఆర్ఎస్ హయాంలో జరిగిన కుంభకోణాలపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఎన్ని అక్రమాలు జరిగాయో తెలియడానికి మేడిగడ్డ బ్యారేజీ, హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాల కృష్ణ, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ విషయంలో వెలుగు చూసిన అంశాలే నిదర్శనం.  

శివబాల కృష్ణ ఇంటిపై దాడి చేసి ఏసీబీ రూ.150కోట్లను పట్టుకుంది.  మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ యాచారంలో పక్కా ప్రణాళికతో భూసేకరణ పథకాన్నిబహిర్గతం చేశాయి.  ఇప్పుడు తాజాగా ఐఅండ్ పీఆర్ ను అడ్డు పెట్టుకొని ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా జరిగిన కుంభకోణాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

జీహెచ్ఎంసీ, ఐ అండ్ పీ ఆర్ లను మోసం చేసిన సంస్థ  పేరు లీడ్ స్పేస్ అంట. చెత్త ఊడ్చే మిషన్లు దగ్గర నుంచి చెట్లు కత్తిరించే మిషన్లు వరకు అన్నింటా కుంభకోణాలు జరిగాయి. ఈ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా బస్ షెల్టర్ల బోర్డులను కొనుగోలు చేశారు.  మెట్రో యాడ్స్ కి డిమాండ్ రావాలనే ఉద్దేశంతో వేల హోర్డింగులను తీసివేయించారట. జీవో 68తో ఈ కథంతా నడిచినట్లు సమాచారం. మరోవైపు ఐఅండ్ పీ ఆర్ యాడ్స్ లో రూ.350 కోట్లకు వీరికే వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. రూ.300 కోట్లు ఇచ్చారని మాజీ మంత్రి దయాకర్ రావుకు కారు గిఫ్ట్ గా ఇచ్చారంట. ఇప్పటికీ దాని ఈఎంఐ లు లీడ్ స్పేస్ చెల్లిస్తుంది అనే అంశం వెలుగులోకి వచ్చింది. ఈ అంశాలపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్యాప్తుకు ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: