పవన్‌కు ఝలక్‌.. 70మందితో టీడీపీ లిస్ట్‌?

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికార వైసీపీ అన్ని పార్టీలకంటే ముందుంది. ఇప్పటి వరకు ఆరు విడతలుగా అభ్యర్థుల జాబితా విడుదల చేయగా..  టీడీపీ, జనసేన కూటమి సీట్ల విషయం ఇంకా కొలిక్కి వచ్చినట్లు లేదు.  ఈ రెండు పార్టీల పోటీ చేసే స్థానాలపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వీలైనన్ని ఎక్కువ స్థానాలు తీసుకోవాలని జనసేన ప్రయత్నం చేస్తోంది.

అయితే వీటిని ఎలా తగ్గించాలి అనే విషయంపై చంద్రబాబు  కసరత్తులు మొదలు పెట్టారు. వెరసీ ఈ రెండు పార్టీలు అభ్యర్థుల ప్రకటన విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయి. సీట్ల సర్దుబాటు ఎలా ఉన్నావచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగానే వైసీపీ ని ఢీకొడతామని ఇరు పార్టీ అధినేతలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో జనసేనకు కేటాయించే స్థానాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దాదాపు మూడో వంతు సీట్లను జనసేన ఆశిస్తోంది. ఈ విషయంపై కాపు నేతలతో పాటు పార్టీ నాయకులు నుంచి పవన్ కల్యాణ్ కు ఒత్తిడి ఉంది.

అయితే వైసీపీ విడుదల చేస్తున్న అభ్యర్థులపై విమర్శలు చేస్తున్న టీడీపీ అక్కడ తమ అభ్యర్థి ఎవరో చెప్పకుండా ప్రచారం చేస్తోంది. దీంతో స్థానిక నాయకత్వంతో పాటు క్యాడర్ లో గందరగోళం నెలకొంది. మార్పులు చేర్పులు ఉన్న వారి పేర్లనే వైసీపీ ప్రకటిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని,అంబటి రాంబాబు వంటి నేతల పేర్లు ప్రత్యేకంగా ప్రకటించాల్సిన అవసరం లేదు.

రెండు సభల్లో టీడీపీ అధినేత అరకు, మండపేట లో పోటీ చేసే పేర్లను ప్రకటిస్తే దానికి జనసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి..ప్రతిగా మరో సీట్లను పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో పార్టీ క్యాడర్ తో పాటు జనాల్లో కూడా వ్యతిరేక సంకేతాలు వెళ్తున్నాయి. వీటన్నింటిని కప్పి పుచ్చుకునేందుకు తమ అనుకూల మీడియా ద్వారా 70 స్థానాల్లో తమ అభ్యర్థులు ఖరారు అయ్యారని లీకులు ఇప్పిస్తోంది. అయితే జనసేన పరిస్థితి మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: