జగన్‌ అడుగు జాడల్లోనే షర్మిల?

ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు స్వీకరించిన షర్మిళ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం నలుమూలలా ఆమె పర్యటిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ లో కొనసాగి.. ప్రస్తుతం స్తబ్ధుగా ఉన్న నేతలను కలసి హస్తం గూటికి రావాలని ఆహ్వానిస్తున్నారు. అలాగే తన తండ్రి వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితంగా పేరొంది ప్రస్తుత రాజకీయాల్లో చురుగ్గా లేని నేతల ఆశీస్సులు పొందుతున్నారు.

మరోవైపు జగన్, చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో విమర్శలు సాగిస్తున్నారు. సీఎం జగన్ ప్రత్యేక హెదా అంశాన్ని గాలికొదిలేసిందని మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె దిల్లీ వేదికగా  కొత్త స్కెచ్ గీస్తున్నారు. ఇందుకు తన అన్న జగన్ బాటనే ఆమె ఎంచుకున్నారని పలువురు చెబుతున్నారు. అదేంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ ప్రత్యేక హోదా కోసం పలు దీక్షలు చేశారు.  దిల్లీ వెళ్లి అక్కడ కూడా దీక్ష చేపట్టారు. తనకు 20మందికి పైగా ఎంపీలను ఇస్తే ప్రత్యేక తీసుకువస్తానని గత ఎన్నికల ప్రచారం సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఇప్పుడు షర్మిళ కూడా అచ్చం అలాగే ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ నేతలంతా దిల్లీకి రావాలని పిలుపునిచ్చారు. తన అన్న వైఎస్ జగన్ ఎక్కడ అయితే విఫలం అయ్యారో ఆ అంశాలనే పట్టుకొని కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావాలని షర్మిళ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గతంలో ఏపీ విభజన సమయంలో దానికి మద్దతు తెలుపవద్దంటూ వైఎస్ జగన్ దేశంలోని అన్ని పార్టీల నాయకుల వద్దకు వెళ్లి వినతి పత్రాలు ఇచ్చారు. ఇప్పుడు షర్మిళ కూడా వివిధ పార్టీల అధ్యక్షులు శరత్ పవార్ తో పాటు కమ్యూనిస్టుల దగ్గరకి వెళ్తోంది. ఏపీకి విభజన హామీలు అమలు కాలేదని.. ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంట్ లో చర్చించాలని వారికి వినతి పత్రాలు అందజేస్తోంది. మరి ఇది ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: