గద్దర్‌ పేరిట నంది అవార్డులు.. సమంజసమేనా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొంత ఆలస్యం అయితే అయ్యేవి కానీ.. నంది అవార్డులు మాత్రం తప్పకుండా వచ్చేవి. రెండేళ్లకోసారి వచ్చినా ఆ గౌరవం కోసం సినిమా జనాలు వాటికోసం ఎంతగానో ఎదురుచూసేవారు. అయితే ఒక్క రాష్ట్రం కాస్తా రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆ ఆనందానికి సినిమా జనాలు నోచుకోలేకపోయారు. ఇటీవల ఈ అవార్డుల గురంచి చాలామంది సినీ ప్రముఖులు మాట్లాడారు.

అయితే తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ అవార్డుల గురించి మాట్లాడారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జనవరి 31న జరగిని గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు నంది అవార్డుల పేరుతో ఇచ్చే పురస్కారాలను ఇక నుంచి గద్దరన్న అవార్డుల పేరుతో ఇస్తామని ప్రకటించారు. గత పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న నంది అవార్డులను వచ్చే ఏడాది గద్దరన్న జయంతి జనవరి 31న ఈ గౌరవపురస్కరాలు అందజేస్తామని తెలిపారు.

అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా నంది అవార్డులు అనగానే.. నంది విగ్రహంతో కూడిన అవార్డులను సెలబ్రిటీలకు అందజేస్తారు. మరి ఇప్పుడు గద్దర్ ప్రతిమతో కూడిన అవార్డును అందిస్తారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నంది అంటే పవిత్రమైంది. దేవాలయాల్లో శివుని ముందు ఉంటుంది. ఇది ఆయనకు కాపాలాదారు. మనవాళ్లు నందీశ్వరుడు అంటూ పూజలు చేస్తారు.

ఇప్పుడు అలాంటి నంది పేరు తీసి గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడంపై చర్చ నడుస్తోంది. గద్దర్ పేరిట అవార్డు ఇవ్వడాన్ని చాలామంది స్వాగతిస్తుండగా.. కొందరు విబేధిస్తున్నారు. అలాగే అవార్డు పేరే మార్చుతారా లేక ప్రతిమ కూడా మార్చుతారా అనే సందేహం లేవనెత్తుతున్నారు. అలాగే సినీ రంగానికి చేసిన సేవలు ఏంటని కొందరు అడుగుతున్నారు. అలాగే గతంలో గద్దర్‌ యువతను నక్సలిజం వైపు మళ్లించి తన కుమారులను మాత్రం చదువుకు విదేశాలకు పంపారన్న విమర్శలు ఉన్నాయి. గద్దర్ ఆశయాలు అంటే నక్సలిజం సాధించడమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి గద్దర్ అవార్డులపై సోషల్ మీడియాలో బాగానే చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: