ఎనిమిదేళ్ల కాపు ఉద్యమం.. సాధించిందేమిటి?

తునిలో కాపు ఉద్యమం జరిగి ఎనిమిదేళ్లు కావొస్తోంది. ఈ హింస కానీ.. తర్వాత జరిగిన పరిణామాలు వల్ల ఎవరు ప్రయోజనం పొందారు. దీనివల్ల కాపులు సాధించింది ఏమైనా ఉందా. ఎనిమిదేళ్లు గడిచినా కూడా ఎవరితో కలవాలి అనే సంశయంలోనే ఉన్నారు. కాపు రిజర్వేషన్లు ఏమైనా సాధించారా అంటే అదీ లేదు.

కాపుల్లో దాదాపు 75శాతానికి పైబడి ఆర్థికంగా వెనుకబడి  ఉన్నారనడంలో  ఎటువంటి సందేహం లేదు. గ్రామాల్లో అయితే చిన్నపాటి రైతులు, చిన్న చిన్న జీవనోపాధి వృత్తులు, పట్టణాల్లో అయితే ఇతర ఉపాధి మార్గాలు చూసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2014 ఎన్నికల ముందు సమయంలో పాదయాత్ర చేపట్టిన చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత తమ చిరకాల స్వప్నం తీరుతుందని వారంతా భావించారు. కానీ ఆయన కాపులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు.

రిజర్వేషన్లకు సంబంధించి బీసీల్లో వ్యతిరేకత వ్యక్తం అవడంతో.. టీడీపీకి వెన్నెముక అయినటువంటి బీసీ ఓటు బ్యాంకు ఎక్కడ చెదిరిపోతుందో అనే భయంతో ఆ అంశాన్ని పక్కన పెట్టేశారు. ఓ వైపు ముద్రగడ పద్మనాభం చేపట్టిన నిరసన కార్యక్రమాలు…మరోవైపు బీసీల్లో ఎగిసిపడుతున్న ఆందోళలను చంద్రబాబుని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ క్రమంలో కేంద్రం ప్రవేశ పెట్టిన అగ్రవర్ణాల వారికి 10శాతం రిజర్వేషన్లలో కాపు లకు ఐదు శాతం వర్తింపజేస్తూ నాటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ అది అమలులోకి రాకుండానే ఎన్నికలు వచ్చాయి.

తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ కూడా దీనిపై దృష్టి సారంచలేదు. ఇప్పుడు కూడా రాజ్యాధికారం దక్కే అవకాశం పవన్ కల్యాణ్ రూపంలో దక్కింది. కానీ ఆయన టీడీపీ కోసమే పని చేస్తున్నారు తప్ప సీఎం పదవిపై ఆసక్తి లేనట్లు వ్యవహరిస్తున్నారు. చివరకు కాపు ఉద్యమం విజయవంతం అయింది. కానీ ఫలితం దక్కలేదు. అంటే వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: