గెలిచినా.. ఓడినా.. జగన్‌ పేరు చెప్పుకుంటారు?

ప్రతి పేదవాడి కల సొంతింటి నిర్మాణం. పాపం పాపం చాలామంది ఈ కోరిక నెరవేరకుండానే చనిపోతుంటారు. అయితే వీరి కలను సాకారం చేసేందుకు కేంద్రం పీఎం ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. పట్టణాల్లో, గ్రామాల్లోఆర్థికంగా బలహీన వర్గాలు, తక్కువ ఆదాయం కలిగిన ఉన్నవారు, మధ్య తరగతి ఆదాయ వర్గాలు ఈ పథకం కింద అర్హులు.

ఈ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో  గొప్పగా అమలు చేస్తోంది. అయితే ప్రస్తుతం గడువు ముగిసిన డీ పట్టాలను క్రమబద్ధీకరించడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. దానికి రెవెన్యూ శాఖ నుంచి ఎన్వోసీ, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ వాటిని నిషేదిత జాబితా నుంచి తొలగిండచం క్లిష్టమైన ప్రక్రియ. పేద మహిళలు అలాంటి అవస్థలు పడకుండా వారికిచ్చిన ఇళ్ల స్థలాలను వారి పేరుతోనే ప్రభుత్వం రిజిస్టర్ చేసి కన్వేయన్స్ డీడ్ లు ఇస్తోంది.

దేశంలోనే తొలిసారిగా ఒకేసారి 30.61లక్షల ఇళ్ల స్థలాలకు పట్టాలను ఇచ్చి పేదల సొంతింటి కలను నెరవేర్చిన సీఎం జగన్ వాటిని ఆ మహిళల పేరు మీద రిజిస్టర్ చేసి మరో చరిత్ర సృస్టించనున్నారు. తద్వారా పేదలకు ఇచ్చిన ఇళ్లను రిజిస్టర్ చేసిన తొలి ప్రభుత్వంగా సీఎం జగన్ సర్కారు రికార్డులకెక్కనుంది. దీనివల్ల పట్టాలు పొందిన పేదలకు తమ ఇళ్లపై పూర్తి భరోసా దక్కనుంది. దాదాపు రూ. వేలకోట్ల వెచ్చించి పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న తొలి ప్రభుత్వం ఇదే కావడం గమనార్హం.

పేదవానికి అత్యవసర సమయంలో అప్పు పుట్టడం కష్టం. ప్రాణాల మీదకు వచ్చినా.. రూపాయి అప్పు ఇచ్చే వారు ఉండరు. బ్యాంకుల్లోను అదే పరిస్థితి. కానీ జగన్ ప్రభుత్వం ఇస్తున్న డీడ్ ల వల్ల ఆస్థలాలు విలువైన స్థిరాస్తిగా వారికి సమకూరనున్నాయి. ఆ ఆస్తిపై బ్యాంకు రుణాలు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందే అవకాశం కూడా కలుగుతుంది. ప్రైవేట్ ఆస్తి మాదిరిగా లబ్ధిదారులు, వారి వారసులు అనుభవించే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ ఆస్తి భూ వివాదాల్లో చిక్కుకునే అవకాశమే లేదు. పేద మహిళలకు ఈ ఇళ్ల పట్టాలపై పూర్తి భరోసా లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: