జగన్ ఢిల్లీ టూర్‌ వెనుక అసలు రహస్యం?

సీఎం జగన్ ఎందుకు దిల్లీ వెళ్తున్నారు.? హోం మంత్రి అమిత్ షా అపాయిట్ మెంట్ ఎందుకు కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం లేకుంటే కేసలు విషయంలో మాట్లాడేందుకా.. ఇది కాకుండా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఏపీ పొలిటకల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఎన్నికలకు పట్టుమని రెండు నెలల వ్యవధి కూడా లేదు. ఏ క్షణం అయినా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్ అమిత్ షా ను కలిసేందుకు యత్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ రెండు నెలల్లో కీలకమైన సంక్షేమ పథకాల అమలు చేసి ప్రజల అభిమానాల్ని చూరగొనాలని జగన్ భావిస్తున్నారు. వాటితో పాటు ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సంబంధించి బిల్లులు, వైసీపీ కిందిస్థాయి నేతలకు సంబంధించిన బిల్లుల చెల్లించాల్సిన బకాయిలు.. ఇలా అన్నింటికి భారీ మొత్తంలో నిధులు అవసరం. వైసీపీ లో కింది స్థాయి నేతలు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వంటివి నిర్మించారు.

వీటితో పాటు రహదారులు, కాలువల నిర్మాణం చేపట్టారు. వీటన్నింటికి వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిని చెల్లించకుండా ఎన్నికలకు వెళ్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని జగన్ భావిస్తున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం పదేపదే బిల్లుల విషయమై జగన్ కు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో కేంద్రం నుంచి రుణ పరిమితి పెంచుకొని వివిధ పద్దతుల ద్వారా నిధుల సేకరణకు జగన్ దిల్లీ బాట పట్టినట్లు సమాచారం.

గత ఎన్నికల ముందు చంద్రబాబు కూడా ఇదే మాదిరి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2019 ఎన్నికల ముందు చాలా మంది టీడీపీ నేతలు అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టారు. నీరు చెట్టు వంటి పథకాలకు చంద్రబాబు బిల్లులు చెల్లించలేదు. తామే అధికారంలోకి వస్తామనే ధీమాతో చెల్లింపులు జరపలేదు. ఇప్పుడు  ఆ సమస్య వైసీపీ నేతలకు రాకుండా చేసేందుకే జగన్ దిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఎల్లో మీడియా మాత్రం రాజ్యసభ, షర్మిళ ఎంట్రీ, వచ్చే ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో సాయం కోసం వంటి కథనాలను ప్రచురిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: