మనిషి మెదడులో చిప్.. ఎటు దారి తీస్తుంది?

మీ మెదడే కంప్యూటర్ గా మారితే.. మీ జ్ఞాపకాలను మీరే స్టోర్ చేసుకోగలిగితే.. నచ్చినప్పుడు వాటిని రిప్లే చేసుకోగలిగితే ఎలా ఉంటుంది. అద్భుతం కదా. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితం ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్ మస్క్ చెబితే అంతా అసాధ్యం అనుకున్నారు. మెదడు సూపర్ కంప్యూటర్ గా ఎలా మారుతుందనుకున్నారు. కానీ ఆ అసాధ్యాన్ని ఈ వ్యాపార దిగ్గజం సుసాధ్యం చేసే పనిలో ఉన్నారు.

తాను ప్రారంభించిన న్యూరాలింట్ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడిందని.. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ సాంకేతికత ను మానవులపై తొలిసారిగా ప్రయోగించనున్నట్లు ప్రకటించారు. ఓ వ్యక్తి మెదడులో చిప్ ను అమర్చామని.. ప్రారంభ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని వెల్లడించారు. న్యూరాలింక్ ను ఎలన్ మస్క్ 2016లో ప్రారంభించారు. కృత్రిమ మేథ మానవుల మేథస్సును మించిపోనుందని అది మానవాళిపై ఆధిపత్యం చెలాయించనున్నదని మస్క్ వాదన. దాన్ని ఎదుర్కోవడానికే న్యూరాలింక్ ను ప్రారంభించానని పలు సందర్బాల్లో ఆయన పేర్కొన్నారు.

సర్జరీతో మెదడులో చిన్న రంధ్రం చేస్తారు. అందులో ఎనిమిది మి.మీ. వ్యాసం ఉన్న ఎన్1 చిప్ ను అమరుస్తారు. సన్నని వైర్లను నేరుగా మెదడులో ప్రవేశ పెడతారు. చిప్‌ను కచ్చితత్వంతో అమర్చేందుకు న్యూరాలింక్ రోబోను తయారు చేసింది. చిప్ లో బ్యాటరీ వైర్ లెస్ పద్ధతితో ఛార్జ్ అవుతుంది. కాకపోతే చిప్ అమర్చాలంటే బ్రెయిన్ సర్జరీ చేయాలి. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ. మెదడులో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. ఈ పరికరం ఎంత సురక్షితం అనే విషయంపై స్పష్టత రాలేదు.

బ్రెయిన్ లో న్యూరాన్స్ శరీరంలోని నాడులకు, కండరాలకు ఇతర అవయవాలకు సంకేతాలను ప్రసారం చేస్తాయి. చిప్ లో ఎలక్ర్టోడ్స్ ఈ సంకేతాలను అర్థం చేసుకొని మోటార్ కంట్రోల్ రూపంలోకి అనువదిస్తాయి. దీంతో కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లతో పాటు కండరాలు.. నాడులు తదితర శరీరాల అవయవాల కదలికలను నియంత్రించవచ్చు. పక్షవాతం బారిన పడిన వారు తమ మెదడు ద్వారా సంకేతాలను పంపొచ్చు. ఒక వ్యక్తిలో 10వరకు చిప్ లను ప్రవేశపెట్టొచ్చు. ఈ చిప్ ను అమర్చిన తర్వాత మెదడు నుంచి విద్యుత్తు సంకేతాలను అందుకోవడం పంపడం..ప్రేరేపించడం వంటివి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: