మోదీ కీలక నిర్ణయం.. పాక్‌కు చావు దెబ్బ?

శత్రువుని చంపాలంటే… బుల్లెట్లు మాత్రమే వాడాల్సిన అవసరం లేదు. తుపాకీలే ఉపయోగించాల్సిన అవసరం లేదు.  వారి ఆనుపానులు తెలుసుకుంటే చాలు. అక్కడ ఒత్తితే కథ మొత్తం మారుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ అదే చేస్తున్నారు. నోట్ల రద్దుతో పాకిస్థాన్ దొంగనోట్ల ముఠా ఆట కట్టించారు. ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్థాన్ గుండెల మీద తన్నారు. దాయాది దేశంలో తలదాచుకుంటున్న ఉగ్రవాదులను బయట ప్రపంచానికి చూపారు.

ట్రంప్ సహకారంతో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ విభాగంలోని మానవతా సాయం పేరుతో వచ్చే నిధులను చేర్చారు. దీంతో పాకిస్థాన్ కు ఇతర దేశాల నుంచి నిధులు రావడం తగ్గిపోయింది. మానవతా సాయం పేరుతో వివిధ దేశాల నుంచి పాకిస్థాన్ కు భారీగా నిధులు రావడం .. వాటిని పాక్ ఉగ్రవాదులకు చేరవేయడం వంటివి జరిగేవి.  దీంతో వీటన్నింటికి బ్రేక్ పడినట్లయింది.

ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూలో వేర్పాటు వాద ఉద్యమాలు తగ్గిపోయాయి.  గతంలో ఉగ్రవాద భావజాల వ్యాప్తికి కారణమైన వారిని, సహకరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను నరేంద్ర మోదీ ప్రభుత్వం జైల్లో పడేసింది.   మొత్తంగా జమ్మూ కశ్మీర్ లో ప్రశాంత వాతావరణానికి కృషి చేసింది.  భారత ప్రధాని మోదీ తాజాగా తీసుకున్న నిర్ణయం పాక్ ను మరింత ఇబ్బందుల పాలు చేసేలా ఉంది.

పాకిస్థాన్ దేశం ప్రస్తుతం దివాళా తీసింది. అన్ని రంగాలు పాతాళానికి పడిపోయాయి.  పాకిస్థాన్ దేశానికి సింధూ నది ప్రవాహం అత్యంత ముఖ్యం.  ఈ నది ప్రవాహం కొనసాగాలంటే జమ్మూ కశ్మీర్ లోని చీనాబ్ నది ప్రవహించాలి. అయితే ఇప్పుడు చినాబ్ నది మీద  కేంద్రం ఓ ప్రాజెక్టు నిర్మిస్తోంది. దీంతో 850 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి చేయనుంది. ఈ నది నీటిని జమ్మూ కశ్మీర్ లోని వ్యవసాయ అవసరాలకు ఉపయోగించనుంది. దీనవల్ల రూ.5వేల కోట్ల ఆదాయం సమకూరునుందని కేంద్రం అంచనా వేస్తోంది. ప్రాజెక్టు పూర్తయితే సింధూ నది ప్రవాహం తగ్గిపోవడం లేదా ఎండిపోయే ప్రమాద ముంది. అప్పుడు పాక్ చిన్నాభిన్నం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: