రాజ్యపోరు.. జగన్, బాబు.. ఇద్దరిదీ తప్పే?

రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రానుందనేని ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో వాటిలో ఎలాగైనా ఒక్కస్థానం అయినా దక్కించుకోవాలని టీడీపీ పావులు కదుపుతోంది. తద్వారా అధికార వైసీపీపై ఒత్తిడి తీసుకురావొచ్చని.. తమకు అనుకూల పవనాలు ప్రజల్లోకి వెళ్తాయని ఆ పార్టీ భావిస్తోంది.

ఈ క్రమంలో స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం ..  విచారణకు రమ్మనడం,  గంటా శ్రీనివాస్ రాజీనామాను ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. అయితే తాజాగా స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు స్పందించారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ వ్యవహరిస్తున్న తీరును చూసి ఇదేం వ్యవస్థ అని జనం దుమ్మెత్తి పోస్తున్నారని ఆరోపించారు. టీడీపీలో గెలిచి అనధికారికంగా వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్ లను విచారణకు పిలవకుండా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ఓటేయ్యలేదనే కారణంతో నలుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలను విచారణకు పిలవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

వారంతా తాము వైసీపీ అభ్యర్థికే ఓటేశామని చెబుతున్నారు. తమను సస్పెండ్ చేయడం అన్యాయమని తప్పుపడుతున్నారు. మండలి ఎన్నికల్లో ఓటేయ్యలేదనే కారణంతో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం నిబంధనలకు విరుద్ధం అని వ్యాఖ్యానించారు. ఇది కచ్ఛితంగా ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా కూడా టీడీపీలో చేరారు అనేది వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నలుగురూ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.  మరీ టీడీపీ నుంచి వచ్చిన వారి పరిస్థితి ఏంటని అడగొచ్చు. వాళ్లకే నోటీసులు ఇచ్చారు.  వాస్తవంగా అయితే ఇరు పార్టీల ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి. ఇద్దరూ చేసింది అనైతికమే. ప్రస్తుతం వ్యవస్థలో నిజాయితీ అనేది ఎప్పుడో చచ్చిపోయింది. ఎవరి అవకాశ వాద రాజకీయాలు వారివి. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరు అయితే కొద్దిగా ప్రత్యర్థి కంటే మంచివాడో వారినే ప్రజలు ఎన్నుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: