రేవంత్‌ రెడ్డితో షర్మిల.. ఆ విషయాలు చర్చిస్తారా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవడానికి ప్రధాన కారణం నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ ప్రధానాంశాలతోనే తెలంగాణ వ్యాప్తంగా పోరాటాలు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయింది. అయితే ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు పరిష్కారం కావడం లేదు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో నీటిని నిశ్శబ్ధంగా తరలించుకుపోయారు.

అయితే ఏపీ సీఎం జగన్ వ్యూహాత్మకంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాగార్జున సాగర్ డ్యాంపైకి తమ పోలీసులను పంపి తమ వాటా గేట్లు ద్వారా నీటిని విడుదల చేసుకున్నారు. దీంతో ఈ వివాదంపై కేంద్రం కలుగజేసుకొని ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డుకి అప్పగించేయమని సూచించింది. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఒప్పందం మేరకు ఎన్ని టీఎంసీల నీళ్లు కేటాయించారో వాటిని లెక్కప్రకారం విడుదల చేస్తామని ప్రకటించింది. 2015 సమయంలో బచావత్ ట్రిబ్యూనల్ పై అప్పటి తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది. అప్పీల్ సంగతి కోర్టులో తేలే వరకు కూడా తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 530 టీఎంసీలను కేటాయిస్తూ అప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు.

కానీ కేసీఆర్ మళ్లీ అడ్డు తగలి 50-50 నీళ్లు కేటాయించాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఆనాడు తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తున్న సమయంలో తెలంగాణకు అనుకూలంగా షర్మిళ మాట్లాడారు.  ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. జల జగడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పెడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది.

దీనివల్ల ఆంధ్రా తమకు రావాల్సిన నీటి వాటాను కోల్పోవాల్సి వస్తుంది. ఫలితంగా ఏపీకి అన్యాయం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా ఏపీకి జరుగుతున్న అన్యాయంపై అన్ని పార్టీలు పోరాటం చేయాలి. షర్మిళ తెలంగాణ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం అవుతారా.. లేక అధిష్ఠానానికి చెప్పి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తారా అనేది చూడాలి.  ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక.. ఆమె కూడా కాంగ్రెస్ నాయకురాలే కాబట్టి టీఎస్ సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: