బాబోయ్‌ కాళేశ్వరం బొక్కలు.. ఏంటిది కేసీఆర్‌?

మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన మానస పుత్రికగా చెప్పుకుంటూ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లో ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ. రూ.3652 కోట్లతో నిర్మించిన ఈ బ్యారేజీ గతేడాది అక్టోబరులో కుంగిపోయింది.  ఏడో బ్లాక్ తో పాటు 6,8వ బ్లాక్ లలోని ఇతర పియర్స్ కు నష్టం వాటిలినట్లు వీడియో తో సహా విజిలెన్స్ అధికారులు అధ్యయనంలో గుర్తించారు. డిజైన్ తో పాటు, నాణ్యత, నిర్వహణ లోపాలు ఉన్నట్లు అంచనాకు వచ్చిన అధికారులు మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు.

గేట్లు కింది భాగంతో పాటు గేట్లు అమర్చడానికి ఏర్పాటు చేసిన సపోర్ట్ వాల్స్ కూడా పూర్తిగా పగుళ్లు వచ్చాయి. బ్యారేజీకి 20  టన్నుల బరువుతో ఉన్న సిమెంట్ బ్లాక్ సుమారు 100 మీటర్ల మేర కొట్టకుపోయింది. గత బీఆర్ఎస్ పాలకులు ఈ మేడిగడ్డ బ్ఆయరేజీ పనుల కోసం రూ.3652 కోట్లు ఖర్చు చేసింది.

ఇంత పెద్ద  మొత్తంలో డబ్బులు చెల్లించి నాణ్యత లేకండా నిర్మించడం.. ఇంత త్వరగా శిథిలావస్థకు చేరడం చూసి ప్రస్తుత ప్రభుత్వం, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బ్యారేజీ డ్యామేజీపై కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్, నీటి పారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రిపోర్టును రెడీ చేశారు.

వరద ఉద్ధృతి అంచనా లేకుండానే మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ చేశారని .. ఈ బ్యారేజీ కుంగడం అకస్మాత్తుగా జరిగింది కాదని గుర్తించినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ లొకేషన్, డిజైన్, నిర్మాణం, నిర్వహణ అంతా గందరగోళంగా ఉన్నట్లు వారు తేల్చారు. నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఓక్కరూ దోషులేనని విజిలెన్స్ తమ నివేదికలో పొందుపరిచనట్లు తెలిసింది. తాజాగా వీడియోతో సహా పగుళ్లు బయట పడిన నేపథ్యంలో ఈడీ.. సీబీఐ విచారణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఏమైనా లేఖ రాస్తుందా.. లేక తెలంగాణ సీఐడీ ద్వారా విచారణ చేయిస్తుందా అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: