అప్పట్లో బాబు చేసిందే.. ఇప్పుడు మోదీ చేస్తున్నాడు?

ఎస్సీ వర్గీకరణపై కేంద్రంలో కదలిక వచ్చింది. దీనిపై అధ్యయనంతో పాటు వివిధ వర్గాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఐదుగురు సభ్యులు ఉంటారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్సీ రిజర్వేషన్లపై ప్రధాని హామీ ఇచ్చారు. ప్రకటన చేసిన కొద్ది రోజులకే షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కోసం కమిటీ నియమిస్తున్నట్లు ప్రధాని మోదీ ఆదేశాలు ఇచ్చారు.

మాదిగ పోరాట రిజర్వేషన్ సమితి(ఎమ్మార్పీఎస్) గత 30 ఏళ్లుగా ఈ వర్గీకరణ కోసం పోరాడుతోంది. ఈ అంశాన్ని ఉమ్మడి ఏపీలో ఉండగా చంద్రబాబు ఉపయోగించుకునేవారు. గతంలో ఎస్సీ, ఎస్టీల్లో కాంగ్రెస్ కు బాగా పట్టుండేది. దీంతో ఎస్సీలో వర్గీకరణ చేస్తామని చెప్పి మాదిగలను చంద్రబాబు తనవైపునకు తిప్పుకున్నారు. ఇది చాలా వరకు ఫలితాలు ఇచ్చింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత మోజార్టీ మాదిగలు తెలంగాణ లో ఉండటం వల్ల ఏపీలో వారి జనాభా తగ్గిపోయింది.

ఏపీలో మాలలు ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు వర్గీకరణ అనే నినాదాన్ని పక్కన పెట్టేశారు. తాజాగా ఈ అంశంపై ప్రధాని  మోదీ చొరవ చూపి దీనిపై ఓ కమిటీ వేశారు. ఇప్పుడు మోదీ ప్రతిపాదించిన ఈ అంశంపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. ఈ రోజు షెడ్యూల్డ్ కులాలు ఉన్నాయి. మాదిగలు ఉన్నారు. వారికి ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతూ ఉంది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ,బీ,సీ,డీ కేటగిరీలు తీసుకువచ్చాను.

దానివల్ల వారికి న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రధాని కూడా దీనిపై మాట్లాడుతూ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. నేను 30 ఏళ్లు క్రితం చేసిన దానికి వారు కూడా స్పందించి ఈ రోజు దేశం మొత్తం చేస్తానని ప్రకటించారు. ఇది చాలా శుభపరిణామం అని ప్రకటించారు. అయితే వాస్తవం ఏంటంటే ఆరోజు చంద్రబాబు తీర్మానం చేసి పంపారు కానీ కేంద్రం ఆమోదం తెలపలేదు. ఈ వర్గీకరణ కోర్టు కూడా కొట్టివేసింది. దీనిని మాత్రం చంద్రబాబు దాచిపెట్టి వర్గీకరణ చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: