కల్వకుంట్ల కవిత కొత్త ఉద్యమం.. ఫలిస్తుందా?

కేసీఆర్‌ కూతురు కవిత ఇప్పుడు కొత్త ఉద్యమం ప్రారంభించారు. శాసనసభలో జ్యోతిరావు పూలే విగ్రహ సాధన కోసం భారత జాగృతి తరపున ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమాన్ని బీసీ సంఘాల నాయకులు ఆ సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అభినందించారు. పలు బీసీ సంఘాల నేతలు నిన్న కవితను కలిసి ఇప్పటికే రూపొందించిన కార్యాచరణకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ బీసీ హక్కుల కోసం ఫ్రంట్ ఏర్పాటు చేయాలని వారు ప్రతిపాదించారు.

బీసీ డిమాండ్ల పరిష్కారం కోసం యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరిట ఉద్యమాలు చేపట్టాలని ఈ సమావేశంలో కవిత నిర్ణయించారు. భారత జాగృతి సమన్వయంతో యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరిట ఉద్యమాలు చేపడతామంటున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపట్టాలని కవిత నిర్ణయించారు. ధర్నాకు అన్ని బీసీ సంఘాలు, ప్రజా సంఘాలను ఆహ్వానిస్తామని కవిత ప్రకటించారు. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ సాధన కోసం ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి పదో తేదీ వరకు అన్ని జిల్లాలతో పాటు విశ్వవిద్యాలయాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు కవిత తెలిపారు.

పూలే విగ్రహం ఏర్పాటు కోసం ప్రభుత్వంపై క్షేత్రస్థాయి నుంచి ఒత్తిడి పెంచడంలో భాగంగా ఎమ్మెల్యేలకు... ఫ్రంట్, జాగృతి ప్రతినిధులు వెళ్లి వినతి పత్రం అందించాలని కల్వకుంట్ల కవిత నిర్ణయించారు. ఏప్రిల్ 11న పూలే జయంతిలోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావాలని కల్వకుంట్ల కవిత  డిమాండ్ చేశారు. కులగణన, కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తదితర బీసీ డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తామని ఫ్రంట్ నాయకులు అంటున్నారు.

అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని భారత జాగృతి డిమాండ్ చేసిన మరునాడే సీఎం రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారని కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు.  బీసీల జనగణన, రిజర్వేషన్లపై చర్చించారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. ఇటీవలి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమోదించిన తొమ్మిది తీర్మానాలకు మంచి స్పందన వస్తోందంటున్నారు కల్వకుంట్ల కవిత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: