జనసేన గెలుపుకు ఆ రెండు కులాలు తోడ్పడతాయా?

ఏపీలో ఇటు రెడ్లూ, అట కమ్మలూ రాజకీయాధికారం కోసం పెనుగులాడుతున్నారు. గతంలో కన్నా భిన్నంగా ఈసారి భీకర రాజకీయ పోరాటం సాగుతోంది. జగన్, చంద్రబాబుతో పాటు పవన్ కూడా సీఎం పదవిపై ఆశతో ఉండటంతో ఈసారి మూడు ప్రధాన వర్గాల మధ్య రాజ్యాధికారం కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈసారి ప్రజలు ఎవరు ఆదరిస్తారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

అయితే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరేందుకు రంగం సిద్ధమైందనే వార్తలు వచ్చాయి. పవన్ వచ్చి ముద్రగడతో చర్చలు జరిపిన అనంతరం పార్టీలో చేరతారు అని జనసేన నేతలు చెప్పారు. అయితే కాపు నేతలందరూ జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కాపు రిజర్వేషన్లను వ్యతిరేకింతే వారంతా జనసేనకు ఓటేస్తారా.. ఈ ప్రభావం టీడీపీ పై ఉంటుందా అనే ప్రశ్నలు అందరిలో నెలకొన్నాయి. వీటిపై విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

గతంలో 2014 సమయంలోనే వైసీపీ అధికారంలోకి వస్తోందని మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు గ్రామాల్లో హడావుడి చేయడం ప్రారంభించారు. ఎందుకంటే వైసీపీకి బలమైన సామాజిక వర్గం మాల. వీళ్లు గ్రామాల్లో డామినేషన్ చేయడంతో ఆ పార్టీ విజయావకాశాలను బాగా దెబ్బతీసింది. అలాగే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో కాపు నేతలతో పాటు ఆ సామాజిక వర్గంలో ఒక బలమైన వేవ్ వచ్చింది.

అలాగే సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో కమ్మ సామాజిక వర్గ నేతలు తమ భవిష్యత్తును టీడీపీలో చూసుకున్నారు. కాకపోతే ఎన్టీఆర్ జన నాయకుడు. లేకపోతే అంతటి ఘన విజయాన్ని సాధించలేరు కదా. అలాగే ప్రజారాజ్యానికి వచ్చిన 70లక్షల ఓట్లు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కాదు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ ని కాపు, కమ్మ అనే అంశం అంశం బాగానే దెబ్బతీసింది. అలాగే పీఆర్‌పీకి కాపు సామాజిక వర్గం కొంత మేర నష్టం కలిగించింది. అలాగే ఇప్పుడు కూడా జనసేనకు నష్టం కలుగుతుందా అంటే.. టీడీపీ నమ్ముకొని ఒక సామాజిక వర్గం ఉంటే.. జనసేనకు కాపు సామాజిక వర్గం ఉంది. ఈ రెండూ కలిస్తే ఆ కూటమికి ఉపయోగకరం అని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: