విజయానికి దారి: నీ మీద నీవు ఫోకస్ చేసుకో?

నీ మీద నువ్వు ఫోకస్ చేస్తేనే జీవితంలో పైకి వస్తావు. నువ్వు అభివృద్ధి చెందుతావు. పనికిరాని విషయాల గురించి ఆలోచించి సమయాన్ని వృథా చేసుకోవడం మొదలు పెడితే నువ్వు అక్కడే ఆగిపోతావు. జీవితం గందరగోళం అవుతుంది.  ప్రతి మనిషికి ఒక అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కొన్ని రకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి.

ఏది అవసరం. ఏది మనకి అనవసరం అనేది విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే జీవితం బంగారు మయం అవుతుంది.  వాస్తవానికి ఆ విచక్షణే మనల్ని గెలిపిస్తుంది. చాలా సందర్భాల్లో మన మనసుల్లో పనికి మాలిన విషయాలు మన మెదడుని తప్పుదోప పట్టిస్తుంటాయి. అవి ఎలాంటి వి అంటే అసలు మన వల్ల అవుతుందా.. అందరూ ఏం అనుకుంటారో.. మనం ఇలా చేయవచ్చా. అనే రకరకాల ఆలోచనలు మనల్నికట్టిపడేస్తుంటాయి.

వాస్తవానికి మన మనసుకు ఏం చేయాలి అనిపిస్తే అదే చేయాలి. మనసుకి మనం ఎంత శక్తిమంతులం అని చెప్పగలిగితే అంతే శక్తివంతులం అవుతాం. ఎప్పుడైతే మనకి పరిమితులు విధించుకుంటామో అప్పుడే మనం ఓడిపోవడం ప్రారంభిస్తాం. మన ఆలోచనలు గొప్పగా, ఉన్నతంగా ఉండాలి. ప్రతి మనిషి పొద్దున లేవగానే ఒక మాట అనుకోని లెగాలి.  అది ఏంటంటే ఈ రోజు నాది. ఈ రోజు నేను 100శాతం నా సమయాన్ని నా అభివృద్ధి కోసం వినియోగిస్తాను. ప్రతిరోజు సాయంత్రం దీనిపై ఎంతవరకు మనం అనుకున్నది చేరుకున్నాం అనేది బేరీజు వేసుకోవాలి.

అప్పుడు మన కోసం మనం ఏం చేశాం.  మన లక్ష్యం, అభివృద్ధి కోసం ఎలాంటి పనులు చేశాం. ఇంతవరకే మనం ఆలోచించాలి. ఇతర పనికి మాలిన విషయాలను మన మెదడులో జొప్పించి వాటి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేసుకోవద్దు. అతిగా ఆలోచించడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ లేదు. కేవలం నీ మీద.. నీ పనుల మీద..నీవు సాధించాలి అనుకున్న లక్ష్యంపై మాత్రమే నీవు ఫోకస్ చేయ్. నీకున్న సమయాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకుంటే అంత రాణిస్తావు. లేకుంటే పక్కదారి పట్టి జీవితంలో ఎదగలేవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: