డేంజర్‌: హిందూ మహాసముద్రంలో చైనా గూఢచర్యం?

హిందూ మహా సముద్రంలో చైనా ఎత్తుగడలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నాయి. ఇంతకు ముందు ముత్యాలహార సిద్ధాంతం పేరుతో భారత్ ను హిందూ మహా సముద్రంలో ఎన్ సర్కిల్ చేయడానికి యత్నించింది. మయన్మార్ లో కొక్కో ఐలాండ్స్, శ్రీలంక లో హంబన్ టోటా, బంగ్లాదేశ్ లో చిత్తగాంగ్ పోర్టు, పాకిస్థాన్ లో గ్వాదార్ పోర్టు లను ఇన్ఫ్రా స్టక్చర్ అభివృద్ది పేరుతో వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకొని భారత్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది.

పైన పేర్కొన్న దేశాలతో స్నేహం కొనసాగిస్తూ భారత్ వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తూ వస్తోంది. తాజాగా మరోసారి అలాంటి ఘటనే పునరావృతమైంది. ఒక పరిశోధన నౌక ముసుగులో చైనా నుంచి ఒక గూఢచారి నౌక మాల్దీవుల దిశగా సాగుతోంది. పర్యవసానంగా దిల్లీలో ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. మాల్దీవులు మంత్రులు ముగ్గురు ఇటీవల భారత ప్రధాని మోదీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇరు దేశాల ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా నౌక ఉనికి కలవరపరుస్తోంది. జావా, సుమత్రా మధ్య సుంధ జలసంధి మీదుగా సాగి ఇండోనేషియా తీరం మీదుగా చైనా నౌక సాగుతుందని అది ఫిబ్రవరి 8న మాలె చేరుకోవాల్సి ఉంటుందని మెరైన్ ట్రాకర్ యాప్ వివరించింది.  భూ భౌతిక నిపుణుడు డామియన్ సైమన్ అభిప్రాయం ప్రకారం.. ఆ నౌక 2019, 20లో జలాలను సర్వే చేసింది.

బీజింగ్ లో చైనా  అధ్యక్షుడు షీజిన్ పింగ్ మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుతో సమావేశం జరిగిన తర్వాత హిందూ మహాసముద్రంలో ఐఓఆర్ ప్రాంతంలో ఆ నౌక ఉనికి చైనాకు ఎంత ముఖ్యమైందో చెప్పకనే చెబుతుంది. భారత్ నిష్క్రమించాలని అనే ప్రచారం నేపథ్యంలో ఎన్నికైన మయిజ్జు మార్చి 15 కల్లా భాతర్ తన సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని ఇప్పటికే డిమాండ్ చేశారు. కాగా మాల్దీవుల్లో సుమారు 100మంది భారత్ సైనికులు, సైనిక ఆస్తులు ఉన్నాయి. ఇది భారత్ కు ఓ రకంగా ఇబ్బందికర పరిణామమే అని నిపుణులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: