షర్మిళ ఆరోపణలకు సాక్షితో జగన్‌ జవాబు?

ఏపీలోని రాజకీయాలు అటు సీఎం జగన్ ఆయన సోదరి వైఎస్ షర్మిళ మధ్య సాగుతున్నాయి.  షర్మిళ వైసీపీ ప్రభుత్వంపై తన దైన శైలిలో విరుచుకుపడుతున్నారు. దీనికి వైసీపీ మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం రోజు రోజుకూ తీవ్రం అవుతుంది. ఇందులో భాగంగా ఆమె రూ.70 వేల కోట్ల విలువైన గంగవరం పోర్టును ప్రభుత్వ పెద్దలు రూ.600 కోట్లకు అమ్మేశారు అంటూ వైసీపీపై ఆరోపణలు చేశారు.

అయితే అసలు ఆ పోర్టు మొత్తం విలువే రూ.6200 కోట్లని అందులో కేవలం 10శాతం వాటా ఉన్న ప్రభుత్వం దానిని ఎలా అమ్ముతుందని సాక్షి ద్వారా ఆమెకు కౌంటర్ ఇచ్చారు. కళ్లు మూయకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్టగా పేరొందిన చంద్రబాబు అవి అబద్ధాలని అందరికీ తెలిసిపోతుండటంతో తన స్ర్కిప్టును చదవడానికి ఇతరులను ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ ను రంగంలోకి దింపిన ఆయన.. తాజాగా పీసీసీ అధ్యక్షురాలి హోదాలో షర్మిళను ప్రవేశపెట్టి తన స్ర్కిప్టును ఆమె చేత వల్లె వేయిస్తున్నారు.

రూ.70వేల కోట్ల విలువైన గంగవరం పోర్టును అదానీ గ్రూపునకు ప్రభుత్వం రూ.600 కోట్లకు అమ్మేసిందంటూ ఆమె విశాఖలో మాట్లాడారు. అసలు ఆ పోర్టు విలువ ఆమె చెప్పిన దాంట్లో 10శాతం కూడా లేదని.. అందులోను ప్రైవేట్ వాటా 89.6శాతమని దానిని అదానీ గ్రూపు కొనుగోలు చేసిందని.. అది ఇద్దరి మధ్య జరిగిన ప్రైవేట్ డీల్ అనే వాస్తవాన్ని మాత్రం చెప్పలేదు.

నిజానికి ప్రభుత్వానిది ఆ పోర్టులో వాటా 10.4 శాతం కాగా పోర్టు విస్తరణకు వీలుగా దానిని విక్రయించాలని కొనుగోలు దారు అభ్యర్థించడంతో ప్రభుత్వ నిపుణులు సూచించిన దానికన్నా రూ.20 కోట్లు అధికంగానే అంటే రూ.644.45 కోట్లకు విక్రయించారు. ఆ నిధులతో ఇప్పుడు మరో మూడు కొత్త పోర్టులను ప్రభుత్వం సొంతంగా అభివృద్ధి చేస్తోంది. అయితే ప్రభుత్వంలో గతంలో కుదిరిన లీజు ఒప్పందంలో ఎలాంటి మార్పులు లేవు. మరి భూమలు సహా అమ్మేసినట్లు మాట్లాడటం షర్మిళ అవగాహన రాహిత్యం కదా అంటూ ప్రశ్నించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: