విజయమ్మ నోరు విప్పితే రాజకీయ భూకంపమే?

అన్నా చెల్లెలు తగవు మధ్యలో తల్లిని లాగారు. అలా లాగింది ఎవరో కాదు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళనే. ఆమె కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరిస్తూనే జగన్ పై విమర్శల జోరు పెంచేశారు. ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. సోదరుడు జగన్ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె అయిన తాను ముమ్మాటికీ వైఎస్ షర్మిళా రెడ్డినే అని తేల్చి చెబుతున్నారు.

తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ కాంక్లేన్ లో సీఎం జగన్ పాల్గొన్నారు. యాంకర్ అడిగిన దానికి బదులిస్తూ కాంగ్రెస్ ను నిందించారు. తమ కుటుంబంలో కాంగ్రెస్ చిచ్చు పెడుతోందని చీలిక తెస్తోందని ఆయన అన్నారు.  దీనికి కౌంటర్ గా షర్మిళ వైఎస్సార్ కుటుబంలో చీలిక తెచ్చింది చిచ్చు పెట్టింది జగనే అంటూ హాట్ కామెంట్స్ చేశారు.  ఈ రోజు వరకు నేను ఏది ఆశించి నా అన్న వద్దకు వెళ్లలేదు.  దానికి అమ్మతోడు ఒట్టు కూడా పెట్టేశారు. అంతే కాదు దీనికి పైన ఉన్న దేవుడు, అలాగే తన తల్లి విజయమ్మ సాక్ష్యం అని చెప్పారు.

అలా ఆమె అనుకోకుండా వైఎస్ విజయమ్మను వివాదంలోకి లాగారు. అసలే తన ఇద్దరు బిడ్డలు రాజకీయం కోసం సమరం చేసుకుంటూ ప్రత్యర్థులుగా మిగిలారు అని బాధపడుతున్న విజయమ్మను కుటుంబ గొడవలకు లాగడం మీద తీవ్ర చర్చ సాగుతుంది. ఇప్పుడు విజయమ్మ ఏం చెబుతారు అనేది ప్రశ్నగా మిగిలింది.

ఆమె ఎవరి పక్షం చెబుతారు అనేది ప్రస్తుతం  ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అటు చూస్తే కుమారుడు, ఇటు చూస్తే కుమార్తె ఉన్నారు. ఎవరికి ఆమె అనుకూలం అవుతారు. ఎవరికీ దూరం అవుతారు. ఇది ఆమెకు ఇబ్బంది కలిగించే అంశమే. షర్మిళ తెలిసి చేశారా లేక ఆవేశంలో చేశారా పక్కన పెడితే విజయమ్మ మీద ప్రస్తుతం అందరి చూపు ఉండేలా మాత్రం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: