పవన్‌కు కూడా చంద్రబాబు వెన్నుపోటు తప్పదా?

ఓ వైపు జనసేనతో పొత్తు ఉందని చెబుతారు.. మరోవైపు తమ అభ్యర్థులను గెలిపించమని పిలుపునిస్తారు. ఇది చంద్రబాబు మార్కు రాజకీయం. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉందని ఇప్పటికే ఇరు పార్టీల అధినేతలు ప్రకటించారు. కానీ సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ఎంపిక ఇప్పటివరకు కొలిక్కిరాలేదు. అయినప్పటికీ టీడీపీ చేపట్టిన రా కదిలి రా సభల్లో మాత్రం తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు పిలుపునివ్వడం జనసేన నేతలకు, ఆశావహులకు మింగుడు పడటం లేదు.

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అయోధ్య ఆహ్వానం అందడంతో ఆయన అక్కడికి వెళ్లారు.  బీజేపీతో పొత్తులో ఉన్నామనే విషయం పవన్ చెబుతున్నా టీడీపీ, జనసేన కూటమిలో కాషాయ పార్టీ ఉందా లేదా అనే విషయమై స్పష్టత రావడం లేదు.  బీజేపీ మాత్రం జనసేనతో తన మిత్ర ధర్మాన్ని పాటిస్తూ వస్తోంది. ఒక వైపు అభ్యర్థుల ఖరారు అంశాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఫైనల్ చేయాల్సి ఉంది.  

మరో వైపు క్షేత్రస్థాయిలో టీడీపీ-జనసేన మిత్ర పక్షాన్ని విజయవంతంగా ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఇంత బిజీగా ఉన్నా కూడా  చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు అయోధ్యకు వెళ్లడం వెనుక రాజకీయ కోణం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  కేంద్రంలోని బీజేపీని మచ్చిక చేసుకొని వచ్చే ఎన్నికల్లో కాషాయ దళంతో కలిసి ముందుకు వెళ్లాలని వ్యూహం ఒకటి కాగా హిందూ సామాజికవర్గాన్ని తమ వైపు తిప్పుకోవచ్చు అని ఇద్దరు నేతలు భావించి ఉండొచ్చు.

అయితే చంద్రబాబు పలు చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో జనసేన నేతల్లో అసంతృప్తి నెలకొంటొంది. అయోధ్య నుంచి వచ్చిన తర్వాత అయినా జనసేన పోటీ చేసే నియోజకవర్గాలపై స్పష్టత ఇవ్వాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. చిట్ట చివరి వరకు సాగదీసి ఆఖరి క్షణంలో అభ్యర్థులను ప్రకటించినా పెద్దగా ప్రయోజనం ఉండదని ఇరు పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు.  ఇప్పటికి అయినా సీట్ల సంఖ్యతో పాటు అభ్యర్థులను ప్రకటించాలని పవన్ కల్యాణ్ ను కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: