వాళ్లంతా.. ఇప్పుడు గుర్తొచ్చారా కేసీఆర్‌?

బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అవుతోంది. నియోజక వర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఈ సమీక్షల్లో కార్యకర్తలు, నేతలు అధిష్టానం తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలను అధిష్టానం కూడా పాక్షికంగా అంగీకరిస్తోంది. ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వలేదని అంటోంది. అయితే దీనిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునందన్ రావు మండిపడుతున్నారు. అధికారం కోల్పోయాకా భారాసకు కార్యకర్తలు గుర్తొచ్చారా అని ప్రశ్నిస్తున్నారు.

మీక్షల పేరుతో కార్యకర్తలకు, ఉద్యమ కారులకు సముచిత స్థానం,సీట్లు ఇస్తామనడం సిగ్గు చేటని.. ఎన్నికల తర్వాత ఈ రెండు మాటలకు కట్టుబడి ఉంటారా అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునందన్ రావు ప్రశ్నించారు. శంకరమ్మ విషయంలో మీరు అన్నమాట గుర్తు రాలేదా... కొత్త అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నెలకు రాసి అసలైన ఉద్యమకారులకు అవకాశం ఇస్తామని ప్రమాణం చెయ్యండని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునందన్ రావు సవాల్ విసిరారు.

మల్లన్న సాగర్,పోచమ్మ సాగర్ పేరుచెప్పి ప్రజలవద్ద వందలకొట్లు దోచుకున్నారని.. త్యాగం చేసిన కుటుంబాలకు సీట్ల అవకాశం ఇస్తామని చెప్పే దమ్ము,దైర్యం ఉందా అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునందన్ రావు ప్రశ్నించారు. కేటీఆర్ ని సీఎం చేస్తా మీ ఆశీర్వాదం కావాలని అడిగినరోజే మీకు మాకు పొత్తు కుదరదని మోడీ చెప్పిన రోజే ఇద్దరిమద్య తెగతెంపులు అయినాయన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునందన్ రావు.. తెలంగాణ సమాజం అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని, మి పార్టీ నీ బొంద పెట్టిర్రని అన్నారు.

మజ్లీస్ తో నిన్నటివరకు పొత్తు పెట్టుకుంది మీరుకాదా.. అదే మజ్లీస్ ఇప్పుడు కాంగ్రెస్ తో దోస్తీ చేస్తుంది కదా అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునందన్ రావు గుర్తు చేశారు. కార్యకర్తలకు మీ పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం నేర్చుకోండన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునందన్ రావు.. అప్పనంగా ఏపీ భారాస అధ్యక్షునికి భూములు అప్పగించి అధ్యక్షుడిని చేశారు కదా..అతన్ని పిలిచి సమీక్ష చేయగలరా అని ప్రశ్నించారు. తలుపులు పెట్టీ సమీక్షలు పెడుతుంటే కార్యకర్తలు బాధపడుతుర్రని.. ఫస్ట్ శంకరమ్మ,ఎర్రోళ్ల శ్రీనివాస్,లాంటి వాళ్లకు సీట్లు ఇవ్వండని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: