దేశం మెచ్చేలా మోదీ కొత్త పథకం.. అద్భుతం?

అయోధ్యలో బాల రాముడి ప్రాణ  ప్రతిష్ఠ  అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామయ్య భక్తులు ఈ క్రతువును తిలకించి పులకించి పోయారు. ఈ మహత్తర ఘట్టం కోసం కోట్ల మంది ప్రజలు 500 ఏళ్లుగా ఎదురు చూశారు.  జనవరి 22న ఆ మహత్తర కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. ప్రధాని మోదీ దీని కోసం 11 రోజుల పాటు కఠిన దీక్ష కూడా తీసుకున్నారు.

ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని ఘనంగా ముగించిన తర్వాత మరో బృహత్తర కార్యానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఆ అద్బుతమైన పథకం గురించి అయోధ్య నుంచి రాగానే సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.  ఇప్పటికే దేశ ప్రజల కోసం ప్రధాని పేరిట అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆ జాబితాలోకి మరో కొత్త పథకం చేరనుంది. అన్ని పథకాలతో పోలిస్తే ఈ  పథకం ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ఈ పథకాన్ని ఆ అయోధ్య రామయ్యకు ముడిపెడుతూ ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.  ఆ పథకం పేరు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన.

దీనికి శ్రీరామునికి ఉన్న సంబంధం ఏంటంటే.. ఆ రాముడు సూర్యవంశీయుడని అందరికీ తెలిసిందే. ఆ రామయ్య ఆశీస్సులతో దేశంలో ఉన్న కోటి మంది ఇళ్లపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయనున్నట్లు జనవరి 22న మోదీ ప్రకటించారు. ఈ పథకం కింద కోటి మంది ఇళ్లలో సోలార్ వెలుగులు నింపనున్నాయి. ఈ పథకానికి సంబంధించిన ఫొటోలను మోదీ తన ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

సూర్యవంశీయుడైన ఆ శ్రీరామ మూర్తి కాంతి నుంచి ప్రపంచంలోని భక్తులు అందరూ శక్తిని పొందుతున్నారు. ఈ రోజు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశంలోని ప్రజల తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్ ఉండేలా నిర్ణయం తీసుకున్నాం. అయోధ్య నుంచి వచ్చిన తర్వాత తీసుకున్న నా మొదటి నిర్ణయం ఇది అని మోదీ తెలిపారు. దీనివల్ల ప్రజలకు విద్యుత్తు ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు చేసిన వారమవుతామని ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: