మోడీని గెలికితే.. తట్టుకోవడం కష్టం?

దేశంలో తనను ఎంత విమర్శించిన పర్లేదు కానీ దేశానికి ఎలాంటి హనికారకమైన పనులు చేస్తే సహించేది లేదని నరేంద్ర మోదీ గతంలోనే స్పష్టం చేశారు. ఆయన దేశ భద్రత విషయంలో చాలా కఠినంగా ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్య జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్‌ కౌంటర్‌‌ లో నలుగురు ఇండియన్ ఆర్మీ సోల్జర్లు మరణించారు.

అయితే పీవోకే విషయంలో గానీ, ఇతర విషయాల్లో గానీ ఎక్కడా కూడా  తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.  అక్కడికి వెళ్లిన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎవరినీ విడిచిపెట్టమని లెక్క సరి చేస్తామని టెర్రరిస్టులను ఇటీవల హెచ్చరించారు. గతంలో కూడా సైనికుల మీద దాడి చేసిన వారిపై సర్జికల్ 1, సర్జికల్ 2 లాంటి దాడులతో ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులను ఏరివేసింది. కానీ ఆ విషయాన్ని కొన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అస్సలు ఒప్పుకోరు.

సర్జికల్ స్ట్రైక్ మొత్తం బూటకమని విమర్శలు చేస్తుంటారు. కానీ అలాంటి సర్జికల్ స్ట్రైక్ లు ఎన్ని చేయడానికైనా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని ఏ మాత్రం తగ్గేది లేదని బీజేపీ నాయకులు చెబుతుంటారు. దేశ రక్షణ విషయంలో ముఖ్యంగా నరేంద్ర మోదీ పటిష్ట చర్యలు తీసుకోవడంలో ఎక్కడా తగ్గకుండా పని చేస్తున్నారు. అందుకే పాకిస్థాన్, చైనా చేస్తున్న దురగాతాలను అడ్డుకుంటుంది. కానీ ఇండియాలోనే నరేంద్ర మోదీని విమర్శిస్తూ ఆయనపై బురద చల్లే నాయకులు ఎక్కువవుతున్నారు.

దేశంలో కాకుండా విదేశాల్లో కూడా మోదీ అంటే ఎంతో అభిమానం, ప్రేమ కురిపిస్తున్నారు. నాయకుడు అంటే ఇలా ఉండాలని కోరుకుంటున్నారు.  కానీ ఇక్కడి వాళ్లకు అర్థం కాకపోవడం దారుణం. అయితే నరేంద్ర మోదీని కానీ దేశ భద్రత విషయంలో కానీ మళ్లీ గెలకాలని ప్రయత్నిస్తే సర్జికల్ స్ట్రైక్ మరోసారి తప్పదు. కాబట్టి దేశంలో ఉన్న వ్యతిరేకులైనా, దేశానికి హని కలిగించాలని చూసే వారైనా మోదీ ఉన్న విషయాన్ని మరిచిపోవద్దని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: