ఏది నిజం?: టీటీడీ ఛైర్మన్‌.. క్రైస్తవుడా?

తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి తిరుమలలో భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. గతంలో ఇలాంటి విమర్శలే టీడీపీ నాయకులు చేశారు. కానీ భూమన గురించి తెలిసిన వారికి ఆయన కైస్తవుడా.. హిందువా అనేది కచ్చితంగా తెలిసే ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే భూమన కరుణాకర్ రెడ్డి కుమార్తె నేహ రెడ్డికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ రవీంద్ర రెడ్డి కొడుకు తో 2011 లో పెళ్లి జరిగింది.

వైఎస్ రవీంద్ర రెడ్డి కుటుంబం క్రిస్టయన్లు.. దీంతో ఆ మత సంప్రదాయంలో పెళ్లి జరిపించారు. ఆ తర్వాత భూమన వచ్చే సరికి హిందూ సంప్రదాయంలో రిసెప్షన్ జరిపించారు. దీంతో భూమన కరుణాకర్ రెడ్డి కూతురు ఇప్పుడు క్రిస్టయన్ కదా.. ఆయన కూడా క్రైస్తవ మతానికి చెందిన వారు అవుతారని ఆరోపిస్తున్నారు.  హిందూ సంప్రదాయాల ప్రకారం.. కూతురుకు పెళ్లి చేసి పంపించేశారు. అప్పుడు అత్తాగారింటి వద్ద ఆమె మతం మారుతుంది కానీ ఇక్కడ భూమన మతం మారదు కదా.. ఈ మాత్రం కూడా ఆలోచించకుండా కేవలం మత రాజకీయాలు చేయడం కోసమే ఇలా విమర్శలు చేస్తున్నారని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు.

అయితే పుట్ట సుధాకర్ టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో వైసీపీ నాయకులు కూడా ఆయన హిందువు కాదని ఆయనకు చైర్మన్ పదవి ఎలా ఇస్తారని ఆరోపణలు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయన హిందువు అని సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. మరి ఇలాంటి సందర్భంలో భూమన పై ఎన్టీఆర్ కూతురు పురందరేశ్వరీ మళ్లీ భూమన మతం గురించి మాట్లాడటం అవివేకమే అవుతుంది.

రాజకీయాలు టీటీడీ చైర్మన్ పైనే చేయాల్సిన అవసరం లేదని తెలుసుకోవాలి. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిపై పోరాడాల్సిన ప్రతిపక్షాలు కేవలం టీటీడీ చైర్మన్ పదవి పొందిన వ్యక్తి మతం గురించి మాట్లాడటం ఏంటో వారికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: