ఉచితంగా అయోధ్య వెళ్తారా.. ఇవిగో రైళ్లు రెడీ?

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట పూర్తయింది. ఇక అయోధ్యలో రాముడు భక్తులకు దర్శనం ఇస్తాడు. ఆ రాముడిని రాముడి జన్మభూమిలోనే దర్శించుకోవాలని కోరుకోని హిందువులు ఎవరు ఉంటారు. అందుకే ఇప్పుడు అయోధ్య ప్రపంచంలోనే అతి పెద్ద భక్తి పర్యాటక కేంద్రంగా మారబోతోంది. అయితే.. ఇప్పుడు అయోధ్య వెళ్లేందుకు బీజేపీ రైళ్లు సిద్ధం చేసింది. వీటి షెడ్యూల్ ఖరారు చేసింది.

జనవరి 29 నుండి అయోధ్యకు తెలంగాణ నుంచి బీజేపీ ఆధ్వర్యంలో ట్రైన్స్ నడపనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా అయోధ్యకు భక్తులను తీసుకెళ్లనున్నారు. పార్లమెంట్ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ నుండి 200 మందికి అవకాశం కల్పిస్తారు. అయోధ్యకు పోయి రావడానికి 5 రోజుల సమయం పడుతుంది. ప్రతి భోగికి ఒక ఇంఛార్జి ఉంటారు. ప్రతి రైలుకు 20 బోగీలు ఉంటాయి. అంటే ఒక్కో ట్రైన్ లో 14 వందల మందికి అవకాశం ఉంటుందన్నమాట.

1. సికింద్రాబాద్ జనవరి 29 వ తేదీ, 2. వరంగల్ జనవరి 30, 3. హైదరాబాద్ జనవరి 31, 4. కరీంనగర్ ఫిబ్రవరి 1, 5. మల్కాజ్‌గిరి ఫిబ్రవరి 2, 6. ఖమ్మం  ఫిబ్రవరి 3, 7. చేవెళ్ల ఫిబ్రవరి 5, 8. పెద్దపల్లి ఫిబ్రవరి 6.. 9. నిజామాబాద్ ఫిబ్రవరి 7, 10.అదిలాబాద్ ఫిబ్రవరి 8, 11.మహబూబ్‌నగర్‌  ఫిబ్రవరి 9, 12.మహబూబ్ బాద్ ఫిబ్రవరి 10, 13. మెదక్ ఫిబ్రవరి 11, 14.భువనగిరి ఫిబ్రవరి 12, 15.నాగర్ కర్నూల్ ఫిబ్రవరి 13, 16. నల్గొండ ఫిబ్రవరి 14, 17. జహీరాబాద్ ఫిబ్రవరి 15ఇలా  ప్రతి పార్లమెంట్ నియోజక వర్గం నుంచి ఫిబ్రవరి 15 వరకూ రైళ్లు వెళ్తాయి. సికింద్రాబాద్, కాజి పేట నుంచి ట్రైన్లు ప్రారంభం అవుతాయి.
సికింద్రాబాద్, నిజమాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ , మల్కాజ్ గిరి, మెదక్ పార్లమెంట్ నియోజక వర్గాలు సికింద్రాబాద్ నుంచి, నల్గొండ, వరంగల్, మహబూబ్ బాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీం నగర్, పెద్దపల్లి కాజీపేట నుంచి ప్రారంభం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: