జగన్.. కేసీఆర్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలివే?
కానీ ఒక్కసారి పరిస్థితి మారి అధికారం గనుక తమ చేతి నుండి జారితే కనుక అప్పుడు తెలుస్తుంది అసలు యదార్థం ఏమిటో. అప్పటివరకు తాము ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గెలుస్తామని ధీమాలోనే ఉంటారు. చుట్టూ ఉన్నవారు కూడా అదే భ్రమని కల్పిస్తారు. కానీ ఆరోజు వచ్చి ఒకసారి ఎన్నికలలో కనుక అపజయం పాలు అయితే వాస్తవ పరిస్థితులు బయటపడతాయి. చుట్టూ ఉన్న వాళ్లలో తమ వాళ్ళెవరో కూడా అప్పుడే అర్థమవుతుంది.
ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి అలాగే ఉంది అని అంటున్నారు కొంతమంది. ఇది చూసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలపై దృష్టి సారించాలి అంటున్నారు రాజకీయ నిపుణులు. అవేంటంటే కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉంటే వాటిని తొలగించి వారిని ఏకధాటిపై నిలపగలగాలి. అలాగే రహదారుల మరమ్మత్తుల విషయంపై దృష్టి సారించాలి.
అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ వర్గాలకు కార్పొరేషన్ లు ఉన్న కూడా పథకాల ద్వారా వారికి సరైన మొత్తం అయితే అందడం లేదని అంటున్నారు. అంతేకాకుండా మీడియా సాక్షిగా అహంకార పూరితంగా మాట్లాడే వ్యక్తుల పై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు ఇలా మాట్లాడేవాళ్లపై ఒక రకమైన వ్యతిరేక భావం అనేది ఏర్పడిపోతుంది కాబట్టి. ప్రతిపక్షాలు విసిరే సవాళ్లను, ప్రతిపక్ష వర్గానికి సంబంధించిన మీడియా విసిరే సవాళ్ళను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా దృష్టి సారించాల్సి ఉంది.