పవన్‌.. మరీ అంతగా దాసోహం అయితే ఎలా?

ఇలాంటి మిత్రులు మాకెందుకు దొరకలేదు అని మిగతా పార్టీలు బాధపడేలా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారు. పవన్ కల్యాణ్ లాంటి వీర వినయ  విధేయ మిత్రుడు టీడీపీకి దొరికిన విధంగా మరే పార్టీకి దొరకలేదు.  ఈ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా వెనుకబడే ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

2019 ఎన్నికల్లో ఓటమి చెందగానే బీజేపీతో కలసి పొత్తు ప్రకటించుకున్నారు పవన్ కల్యాణ్. కానీ పొత్తు  పెట్టుకున్న దగ్గర నుంచి ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేలేదు. ఆయన ముందుకు వెళ్లలేదు. కనీసం బీజేపీతో కలసి ఉమ్మడి కార్యక్రమాలు జరిపింది కూడా లేదు. అదే టీడీపీ విషయానికి వచ్చే సరికి తన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. పొత్తు ధర్మం నిక్కచ్చిగా పాటిస్తున్నారు. ఏ స్థాయికి వచ్చారంటే టీడీపీ కోసం సొంత పార్టీ నేతల్నే విమర్శిచే రేంజ్ కి పవన్ కల్యాణ్ వెళ్లారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రలో ఉన్న చంద్రబాబుని పరామర్శించేందుకు అని వెళ్లి పొత్తు ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారా లేక వ్యక్తిగతమా అనేది ఆయనకు తెలియాలి. ఇది పక్కన పెడితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేసింది. కూకట్ పల్లిలో టీడీపీ క్యాడర్ కొంత మేర ఉంది. ఇక్కడైన మాకు మద్దతు ఇవ్వరా అని ప్రశ్నించిన నాయకుల్ని మీరు వైసీపీ కోవర్టులు ఇలా విభజించడం అవుతుంది. ఇష్టం అయితే ఉండండి లేకుంటే పార్టీ నుంచి వెళ్లండి అని చెప్పే నాయకులు ఎంతమంది ఉంటారు.

టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకున్న సమయంలోను కొంతమంది నేతలు ఆయా పార్టీలను తిట్టుకున్నారు. కానీ వాటిని ఖండించి అదుపు చేసే ప్రయత్నం చంద్రబాబు కానీ.. బీజేపీ నేతలు కానీ చేయలేదు. కానీ ప్రస్తుతం పవన్ విషయానికి వచ్చే సరికి నేనే టీడీపీతోనే వెళ్తాను. ఈ విషయంలో బీజేపీని కూడా ఒప్పించాను. ఇష్టం అయితే ఉండండి లేకుంటే వెళ్లండి అని పవన్ లా చెప్పే మిత్రుడు ఎంతమందికి దొరుకుతాడని ఆశ్చర్యంగా చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: