జగన్‌ను ఫాలో అవుతానంటున్న రేవంత్?

భారత దేశంలో వాలంటీర్లను నియమించిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రతి 40 కుటుంబాలకు ఒక వాలంటీర్ ని నియమించి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వివరించి వారికి అందజేయడం వీరి కర్తవ్యం. ఇది ఎవరూ ఊహించని విధంగా విజయవంతం అయింది. దీంతో పలు రాష్ట్రాల సీఎం లు ఏపీలో అమలవుతున్న విధానాలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తాం అని ప్రకటించారు.


మంచిని గ్రహించడంలో తప్పు లేదు. తాజాగా తెలంగాణలోని అన్ని పార్టీల నాయకులు కూడా జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ప్రకటిస్తున్నాయి. రెండు సార్లు అధికారంలో ఉన్న కేసీఆర్ తో పాటు, వందేళ్ల  చరిత్ర కలిగిన కాంగ్రెస్ కూడా వైసీపీ అమలు చేస్తున్న విధానాలను అనుసరించేందుకు ఆసక్తి చూపుతోంది.


తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే ఏపీలో ఉన్న వాలంటరీ వ్యవస్థను తెలంగాణలో కూడా అమలు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామలో జరిగిన సభలో మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడమే కాకుండా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పుతోంది. లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.


మరోవైపు గులాబీ బాస్ కూడా ఏపీలో జగన్ అమలు పరుస్తున్న దశల వారీగా పింఛన్ల పెంపును తెలంగాణలో కూడా పాటిస్తామని ప్రకటించారు. పింఛన్లు, రైతు బంధు వంటి సంక్షేమ పథకాలు విడతల వారీగా పెంచుకుంటూ పోతామని ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా చెప్పారు. దీంతో పాటు ఏపీలో వాహన రిజిష్ట్రేషన్లు వ్యవస్థ కూడా ప్రత్యేకంగా ఉంటుంది.  ఏపీలో వాహనం కొంటే ఆ షాపు నుంచే నేరుగా రిజిష్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లో ఈ వ్యవస్థ లేదు. వెళ్లి క్యూలైన్లో నిల్చొవాల్సిందే. ఈ హామీని కూడా ఏమైనా ప్రకటిస్తారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: