మోదీకి జగన్ ఆ లెక్కలు చెబుతున్నారా?
ముఖ్యంగా ఆరోగ్య శాఖకు చెందిన నిధులు అయితే ప్రభుత్వం తన అవసరాలకు వాడుకొని ఆ తర్వాత తనకు నచ్చినప్పుడు నిధులు ఇస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు వాడుకోవడం పరిపాటిగా మారింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. సర్వశిక్షా అభియాన్ లో వచ్చిన నిధులను నాడు నేడు కింద పాఠశాలల అభివృద్ధికి వినియోగిస్తున్నారు. అదే చంద్రబాబు హయాంలో వాటిని పాఠశాలలకు జీతాలు కింద ఇచ్చారు. అలాగే పసుపు కుంకమ పథకం కింద అన్ని కార్పొరేషన్ నుంచి బీసీ, ఎస్సీ కార్పొరేషన్ నుంచి కూడా నిధులను సేకరించి ఆ పథకానికి వెచ్చించారు. అంటే చంద్రబాబు చేస్తే కరెక్టు. జగన్ చేస్తే పెద్ద తప్పు.
11 మెడికల్ కళాశాలల్లో కొత్త మెడికల్ సీట్ల కోసం రాష్ట్రం కేంద్రానికి డీపీఆర్ లు అందించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో కేంద్రం డీపీఆర్ లు అడిగితే నాకు తెలియదా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి రచ్చ రచ్చ రచ్చ చేశారు. డీపీఆర్ లు పరిశీలించిన కేంద్రం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులు సక్రమంగా ఖర్చు చేశారు అని చెప్పడానికి కేంద్రానికి యూసీలు అందించాలి. వాటిని జగన్ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది. అంటే ప్రభుత్వం బాధ్యతగానే ఉంది. కానీ ఎల్లో మీడియానే వక్రీకరంచి వార్తలు రాస్తోంది.