తెలంగాణలో కర్ణాటక రాజకీయ తుపాన్‌?

తెలంగాణలో కర్ణాటక రాజకీయం మొదలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఉద్ధృత ప్రచారం మొదలు పెట్టింది. కాంగ్రెస్ కూడా ధీటుగా వ్యూహాలు రచించి ముందుకు వెళ్తోంది. కర్ణాటక ఎన్నికల విజయంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఊపు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఉత్సాహం అంతటితో ఆగలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి క్యాంపెయిన్లుగా కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ లను రప్పించి మరీ ప్రచారం చేయిస్తున్నారు.


కర్ణాటక మాదిరిగానే ఇక్కడ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెబుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా వీటిని బలంగానే తిప్పికొడుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కరెంట్ సరిగా ఇవ్వడం లేదని  రైతులే ధర్నాలు చేస్తున్నారని ప్రచారం చేస్తోంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కంపెనీలు అన్నీ బెంగళూరు తరలి వెళ్తాయని ప్రచారాన్ని సైతం ఉద్ధృతం చేసింది.


పోయిన చోటే వెతుక్కోవాలి అనే యుద్ధ తంత్రంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఎదుర్కొంటుంది. కర్ణాటక మూలంగానే ఆపార్టీకి గ్రాఫ్ పెరిగింది కాబట్టి అక్కడ సరిగా పథకాలు అమలు కావడం లేదంటూ విమర్శలు గుప్పిస్తోంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వీటిని మించి చేయాలని కాంగ్రెస్ భావించి ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఇవి ప్రజల్లో విశ్వాసం పొందాలంటే ఏదో ఒక రాష్ట్రాన్ని ఉదాహరణకు పెట్టాలి. కేసీఆర్ కు అయితే అది అవసరం లేదు. ఎందుకంటే రెండు సార్లు అధికారంలో ఉన్నారు చేసిన అభివృద్ధి చెప్తూ ప్రచారం చేసుకోవచ్చు.


కానీ కాంగ్రెస్ కు ఆ అవకాశం లేదు. గతంలో వైఎస్ ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి చెప్పాలి. అయితే రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకం కాబట్టి ఆయన గురించి ఎక్కువగా ప్రచారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే పొరుగున ఉన్న కర్టాటకను కాంగ్రెస్ ఎంచుకంటే దానిని వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ తిప్పికొడుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: