బాబు కేసు.. దేశమంతా ఎదురుచూస్తోంది?

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబుకి అనారోగ్య కారణాలతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన సుప్రీంకోర్టు లో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు జరిగాయి.  అనంతరం సుప్రీం ధర్మాసునం తీర్పును రిజర్వ్ చేసింది. కానీ నేటి వరకు  ఈ కేసులో తుది తీర్పు వెల్లడి కాలేదు. దీనిపై పలు అంశాలు చక్కర్లు కొడుతున్నాయి.


వాస్తవానికి చంద్రబాబు రెగ్యూలర్ బెయిల్ కి దరఖాస్తు చేసుకుంటే సుప్రీంకోర్టు ఎప్పుడో మంజూరు చేసేది. కానీ 17 ఏ ద్వారా ఆ కేసును క్వాష్ చేయమని పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవానికి 17ఏ అనేది అవినీతిని అంతం చేసేందుకు తీసుకువచ్చిన చట్టం. ఈ బిల్లుపై పార్లమెంట్ లో పెద్దగా చర్చ జరగలేదు. ఆందోళనల మధ్య దీనిని ఆమోదింపజేశారు. ఈ బిల్లును కేంద్రం ఐఏఎస్ ల రక్షణ కోసం తీసుకువచ్చారు.  


అయితే ప్రజాప్రతినిధులు కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తారు అనే విషయం తర్వాత కేంద్రానికి తెలిసినట్లుంది.  వెంటనే కేంద్ర హోం శాఖ ద్వారా ఎస్ఓపీ(స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్)ని పంపించిది. ఆ రాష్ట్ర డీజీపీ  అనుమతి ఉంటే చాలు ప్రజాప్రతినిధులను అరెస్టు చేయవచ్చు అని అందులో పేర్కొంది. అయితే చంద్రబాబు అరెస్టు విషయంలో డీజీపీ ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఇది పెద్ద సమస్య కాదు.


ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అయితే గవర్నర్ అనుమతి తీసుకోవాలి అయితే ఆయన మాజీ సీఎం కాబట్టి తీసుకోలేదు అని వాదన కూడా ఉంది. అయితే 17ఏ కింద ఈ కేసును సుప్రీం కోర్టు క్వాష్ చేస్తే దేశంలోని రాజకీయ నాయకులందరికీ స్వేచ్ఛ ఇచ్చినట్లు అవుతుంది. మరోవైపు రాజకీయ నాయకులందరీ కేసులు ఏడాదిలోపు విచారణ చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం చెబుతోంది. మరోవైపు గవర్నర్ అనుమతి తీసుకోకుండా ప్రజాప్రతినిధులను అరెస్టు చేయవద్దు అంటూ తీర్పు ఇస్తే  ఇరకాటంలో పడే అవకాశం ఉంది. అందుకే ఈ తీర్పులో జాప్యం నెలకొందని కొందరు సీనియర్ న్యాయవాదులు చెబుతున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: