ముస్లిం డిక్లరేషన్‌: మెజారిటీలు ఏం పాపం చేశారు?

తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. రాజకీయ నాయకులందరూ ఓట్ల వేటకు బయలుదేరారు. ఈ క్రమంలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వివిధ హామీలు ప్రకటిస్తూ ఉంటారు. ఈ క్రమంలో అన్ని వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ ఇలా వరుసగా ప్రకటించింది.

ఇంత వరకు బాగానే ఉంది. మైనార్టీ డిక్లరేషన్ కు ఎవరూ వ్యతిరేకంగా లేకున్నా.. మెజార్టీ వర్గాలకు ఆ విధమైన న్యాయం చేయలేదని పలువురు విమర్శిస్తున్నారు. కొత్తగా వివాహమైన ముస్లిం జంటలకు రూ.1,60,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే హిందువులు, క్రైస్తవులు కి అంత మొత్తంలో నగదు ఇస్తామని ఆ పార్టీ ప్రకటించలేదు. ఇదే వారి ఆగ్రహానికి కారణం అవుతోంది. ఇది ఒక్కటే కాదు మిగతా హామీల్లో ముస్లింలకు తమకు తారతమ్యం చూపించారని చెబుతున్నారు.

కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్ లో ఏం ఉంది అంటే.. మైనార్టీ సంక్షేమ బడ్జెట్ ను రూ.4000 కోట్లకు పెంచి.. రాయితీ రుణాల కోసం రూ.1000 కోట్లను కేటాయిస్తామని  చెప్పింది. దీంతో పాటుగా పదో తరగతి చదివిన ముస్లిం బిడ్డలకు రూ.10 వేలు, ఇంటర్ చదివితే రూ.15 వేలు, డిగ్రీ పూర్తైతే రూ.25వేలు, పీజీ చేస్తే రూ.లక్ష, ఎంఫిల్ పూర్తి చేస్తే రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఇవే చదువులు పూర్తి చేసిన హిందువులు, క్రైస్తవులు పిల్లలు ఏ పాపం చేశారని ప్రశ్నిస్తున్నారు. జనాభాలో ఎక్కవ శాతం ఉండటమే మేం చేసినా నేరమా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఇమామ్ లకు గౌరవ వేతనం రూ.10-12 వేలు ఇస్తామని తెలిపారు. దీని బట్టి ఏం అర్థమవుతుంది అంటే ఓట్లు అన్నీ పోలరైజ్డ్ గా వేసేవారిని దగ్గరికి తీస్తాం.. మిగతా వారిని దూరం పెడతాం అనే సంకేతం ఈ డిక్లరేషన్ ద్వారా అర్థం అవుతుంది. ఇలా విభజించి పాలించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: