జగన్‌.. పేదలనే నమ్ముకున్నారా?

ఆంధ్రప్రదేశ్ లో సిఎం జగన్ పల్లె ప్రాంతాల్లో ఉన్న ప్రజల యోగా క్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. నాడు నేడు,విద్యా దీవెన, లాంటి పథకాలు చాలా వరకు విజయం సాధించాయి.  ప్రతి సారి ఎన్నికల్లో గెలిచిన పార్టీల చుట్టూ ప్రజలు తిరగడం జరిగేది. కానీ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో సరి కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు.


ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందించే పథకాలు వస్తున్నాయా.. లేదా అని చూసే వ్యవస్థను ఏర్పాటు చేశారు.  వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అక్కడ ప్రజలకు కావాల్సిన రేషన్ సరుకులు ఇస్తున్నారు. ఇంట్లో ఎవరికీ పెన్షన్లు రావడం లేదో వారి పేర్లు రాసుకుని  పై అధికారులకు నివేదిక ఇస్తున్నారు. దీంతో వాటిపై వెంటనే విచారణ జరిపి ఇబ్బంది లేకుంటే పెన్షన్లు మంజూరు చేస్తున్నారు.


ఒకప్పటి ప్రభుత్వంలో ప్రతి విషయంలోనూ ఎవరైనా రాజకీయ నాయకుల ప్రమేయం లేనిదే పథకాలు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు పథకాలు వచ్చేవి అమలు అయ్యేది అన్ని  ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు టీడీపీ,జన సేన  పల్లే ప్రజలను ఆకట్టుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం ఎత్తి చూపడం లో విఫలం చెందుతున్నారు.  


పేద , మధ్యతరగతి ప్రజల బాగోగులు చూడడంలో జగన్ సర్కారు సక్సెస్ అవుతోంది. కానీ ఇదే విషయంలో టీడీపీ, జనసేన వెనక బడుతున్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అయితే దీని నుంచి బయట పడలేకపోతున్నారు. టీడీపీ నాయకులు అర్బన్ ఓటర్ లను ఎక్కువగా ఆకట్టుకున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం జగన్ ముందు ఉన్నారు. గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలకు కావాల్సిన అన్ని అంశాలు పరిశీలించే చర్యలు చేపట్టాలి. అప్పుడే టీడీపీ, జనసేన కు గ్రామీణ ప్రాంతాల్లో బలం పెరిగే అవకాశం ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రణాళికలు వేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: