ఏపీ రోడ్లపై జగన్ టీమ్ ఎదురు దాడి?
వాస్తవానికి ఏపీ, తెలంగాణ రోడ్లను పోలుస్తూ ఎల్లో మీడియాలో ఎప్పుడూ కథనాలు రాలేదు. కానీ కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన చేసి మరీ ఆర్టికల్స్ వేసింది. అక్కడ అలా.. ఇక్కడ ఇలా అంటూ రెండు రాష్ట్రాల రోడ్లను పోల్చింది. అయితే వీటిపై బ్లూ మీడియలో ఫ్యాక్ట్ చెక్ అంటూ కొన్ని వార్తా కథనాలను ప్రచురించింది.
అయితే వాస్తవానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో రోడ్డు 30శాతం మాత్రమే బాగుపడ్డాయి. గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయా గ్రామాలకు వెళ్లి అక్కడి స్థానికులను అడిగితే తెలుస్తుంది వాళ్ల పడే బాధలేమిటో.. గతంలో టీడీపీ ఏం చేసిందని వైసీపీ నేతలు అడగవచ్చు. అందుకే కదా ఆ ప్రభుత్వాన్ని ఓడించి మీకు అధికారం ఇచ్చింది.
ప్రజలు ఇబ్బంది పడుతున్నా.. సంక్షేమ పథకాల సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోకి వచ్చి చేరుతుంది కాబట్టి రోడ్లపై తమ అసంతృప్తిని ఎక్కడా వ్యక్త పరచడం లేదు. గతంలో టీడీపీ చేసిన తప్పుల వల్ల రోడ్లు మొత్తం కొట్టుకుపోయాయి. ఇప్పుడు అదే తప్పు వైసీపీ చేస్తోంది. మరోవైపు ఫ్యాక్ట్ చెక్ పేరుతో పోయింది రామోజీరావు పరువే అంటూ బ్లూ మీడియలో కథనాలు ప్రచురిస్తోంది. కానీ ఎల్లో మీడియాలో బాగాలేని రోడ్లపై ఫొటోలతో సహా వార్తలిచ్చేసింది. ఈ ఫొటోలు చూసిన తర్వాత ఇది ఫేక్, ఇది ఫేక్ అంటూ వైసీపీ నుంచి వచ్చే ఫ్యాక్ట్ చెక్ కూడా పనిచేయదు.