ఇదీ జగన్ "స్కిల్" స్కామ్.. టీడీపీ బాంబు?
100 కేవీకి సంబంధించిన లక్ష 86 వేల 505 రూపాయలు ఉంటే ఆంధ్రలో 3 లక్షల కు పైగా ఉంది. 160 కేవీ కి 360 కేవీ ట్రాన్స్ పార్మర్లకు సంబంధించి దాదాపు 8 లక్షల రూపాయలకు పైగా ఎక్కువగా ఉందని సోమరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అయితే కేంద్ర విద్యుత్ పంపిణీ పరిధిలో ఉన్న 611 కోట్ల రూపాయల కాంట్రాక్టు పనుల్లో షిరిడీ సాయి కంపెనీకి 300 కోట్ల పనులు కట్టబెట్టారు.
వివేకానంద హత్య కేసులో ముద్దాయిగా ఉన్న శివశంకర్ రెడ్డి వియ్యంకుడే సీపీడీసీఎల్ సీఎండీగా ఉన్నారు. నాసిరకమైన ట్రాన్స్ ఫార్మర్లను పంపిణీ చేసిన షిరిడీ సాయి ఎలక్ట్రానిక్ కంపెనీకి టీడీపీ అధికారంలో ఉన్నపుడు 170 కోట్లకు పైగా ఫైన్ వేసిందని చెప్పుకొచ్చారు. అలాంటి కంపెనీకి మళ్లీ కాంట్రాక్టు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ ప్రభుత్వం వేసిన ఫైన్ ను 41 కోట్లకు తగ్గించారు. ఆ సంస్థపై ఉన్న కేసులు ఎత్తి వేశారు.
దీనికి ఏం కారణాలు చెబుతారని సోమిరెడ్డి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలుగు దేశం హయాంలో ఫైబర్ గ్రిడ్ కేసు కూడా ఇలాంటి విధానంలోనే జరిగిందని చంద్రబాబుపై కేసు పెట్టారు. మరి ఇలాంటిదే ప్రస్తుతం జరిగిపోయింది కాబట్టి జగన్ పై కూడా కేసు పెట్టాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఎన్ని అవినీతి అక్రమ కాంట్రాక్టులు బయటకు వస్తాయో చూడాలి.