అమెరికాకు ముసలి నాయకత్వమే దిక్కా?

దేశానికి నాయకత్వం వహించడం అంటే  అదృష్టమనే  చెప్పవచ్చు. మన దేశంలో అయితే ప్రధాని పదవి కోసం ఎంతమందైనా పోటీ పడవచ్చు. కానీ అమెరికా లాంటి దేశంలో మాత్రం అధ్యక్ష పదవికి ఇద్దరే పోటీ పడతారు. అమెరికాకు అధ్యక్షుడు అంటే ఒక్క ఆ దేశానికే కాదు. దాదాపు ప్రపంచానికే నాయకుడు. ఎందుకంటే ప్రపంచ దేశాలకు అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ఆ పాత్ర కోసం చైనా, రష్యా లాంటి దేశాలు ప్రయత్నిస్తున్నా సఫలీకృతం కావడం లేదు.


ఇంతటి చరిత్ర కలిగిన అధ్యక్ష పదవికి నియమితలవ్వాలంటే కొన్ని కఠిన నిబంధనలు ఉంటాయి. రెండు పర్యాయాలకు మించి అధ్యక్ష పదవి చేపట్టకూడదు. గతంలో ఆరోగ్యవంతులైన.. వృద్ధాప్యం లేని వ్యక్తులనే అక్కడి ప్రజలు అధ్యక్షుడిగా ఎన్నుకునేవారు.  కాలానుగుణంగా మారి.. ఆస్తులు కలిగిన నాయకులు కావాలనుకుంటున్నారో ఏమో గానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అధ్యక్ష పదవికి ఈసారి 80 ఏళ్లు దాటిన ట్రంప్, బైడెన్ పోటీ పడుతున్నారు.


బైడెన్ ఆరోగ్య పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం. ఉన్నట్టుండి కింద పడిపోవడం, మనిషి ఎదురుగా ఉన్నా గుర్తించకపోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడంలో కన్ఫ్యూజ్ అవ్వడం లాంటివి చేస్తున్నారు. అంటే అవగాహన శక్తి తగ్గిపోతుంది. అనేక సార్లు మాట్లాడటంతో తడబాటుకు గురైన సంఘటనలు మనం చూశాం. అయితే ట్రంప్ వీటిని సాకుగా చూపి నన్ను తదుపరి అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని అమెరికా ప్రజలకు పిలుపునిస్తున్నారు.


అయితే ట్రంప్ మానసిక పరిస్థితి అలానే ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా హంగేరీ ప్రధాని విక్టర్ ఆర్బానీని పట్టుకొని టర్కీ అధ్యక్షుడు అనేశారు.  ఇప్పుడు ఇదే అంశం వైరల్ అవుతోంది. వాస్తవంగా ఆరోగ్యవంతులైన వారసులు రెండు పార్టీల్లో ఉన్నారు.  కానీ ఇటు డెమొక్రటిక్ పార్టీలో కానీ.. రిపబ్లికన్ పార్టీలో కానీ వీరిద్దరికీ మించిన ధనవంతులు లేరు. కాబట్టి అమెరికా ప్రజలు డబ్బు చూసి ఓటేస్తారా.. లేక ఆరోగ్యం చూసి ఓటేస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: