వైసీపీ బస్సు యాత్రకు గండం.. సక్సస్‌ అవుద్దా?

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపట్టారు. చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ అభిమానులను కలిసి వారిని పరామర్శించడం ఆయా కుటుంబాలకు పరిహారం చెల్లించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ తర్వాత బహిరంగ సభ పెట్టి ప్రజలను ఉద్దేశించి జరిగిన అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఇలా టీడీపీ నారా భువనేశ్వరీ ఆధ్వర్యంలో ముందుకు సాగుతోంది.  


ఇక వైఎస్సాఆర్ పార్టీకి సంబంధించి సామాజిక బస్సు యాత్ర కూడా చేపట్టనున్నారు. నవంబర్ 9 వరకు మొదటి విడత యాత్ర, ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో దీన్ని కొనసాగిస్తారు. ఒకే రోజు మూడు ప్రాంతాల్లో బహిరంగ సభలు పెట్టడం చేస్తారు. డిసెంబర్ 31 వరకు 60 రోజుల వరకు ఈ యాత్రలు చేయనున్నారు. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ కి సంబంధించిన వారు దీన్ని చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.


అసలు వైసీపీ చేపట్టనున్న బస్సు యాత్రలకు ఎవరూ ఆర్గనైజర్ గా వ్యవహరించనున్నారు. ఈ మీటింగ్ లకు పబ్లిక్ ను ఎవరు తీసుకొస్తారు. డబ్బులిస్తేనే సభలకు తీసుకుస్తామనే చాలా మంది అంటున్నారు. డబ్బులిచ్చి తీసుకురావడంలో వింత ఏముంది. స్వచ్ఛందంగా సభలకు రావడం జరిగితేనే దానికి ప్రతిఫలం ఉంటుంది. అయితే నామినేటేడ్ పోస్టులు తీసుకున్న వారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కానీ ఆర్థిక పరమైన ఇష్యూలతో వారు దీన్ని ముందుకు తీసుకెళతారా లేదా చూడాలి.


మరో పక్క నారా భువనేశ్వరీ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్ చేసేందుకు టీడీపీ, జనసేన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో వైసీపీ నాయకులు సామాజిక బస్సు యాత్రను ఎంత వరకు విజయవంతం చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బస్సు యాత్ర అంటే ఖర్చుతో కూడుకున్న పని. ఇలాంటి సమయంలో ఎక్కడ జరిగితే అక్కడ ఖర్చు పెట్టుకోవడానికి నేతలు ముందుకు రావాలి. కానీ నామినేటేడ్ పదవులు తీసుకున్న వారు దీని వెనకాడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: