తెలంగాణ కాంగ్రెస్: రేవంత్ రెడ్డి సక్సస్ అయ్యారా?
అయితే వేరే పార్టీ నుంచి వచ్చి.. పార్టీలో చాలా మంది సీనియర్ల ఉన్నా.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి రావడం నిజంగా గొప్ప విషయమే. గతంలో టీపీసీసీ గా బాధ్యతలు నిర్వర్తించిన పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ఆ పార్టీలో అందరూ సహకరించలేదు. అదే పరిస్థితి ప్రారంభంలో రేవంత్ రెడ్డి ఎదుర్కొన్నారు. 2014, 18లో కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం నేతల మధ్య ఆధిపత్య పోరు. ఈ విషయంలో అధిష్ఠానం కూడా చూసీచూడనట్లుగా వ్యవహరించేది. ఈ సారి రేవంత్రెడ్డి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేసుకుంటూ పోతున్నారు.
ఉత్తమ్, పొన్నాలకు సాధ్యం కానీ విధంగా అధిష్ఠానం వద్ద తన మాటకు ఎదురు లేకుండా చేసుకొని తద్వారా పార్టీలో సీనియర్ల పెత్తనం తగ్గించగలిగారు. సీనియర్లుగా చెప్పుకొనే నేతల్ని వారి నియోజకవర్గాలకే పరిమితం చేసి పార్టీపై ఆధిపత్యం సంపాదించారు. గతంలో ఎవరైనా పార్టీలో చేరాలంటే ఆయా ప్రాంత నేతలు బెదిరించడం వంటివి చేసేవారు.
కానీ రేవంత్ మాత్రం పార్టీ నుంచి పోయే వారిని బుజ్జగించకుండా పోనిస్తున్నారు. ఇతర పార్టీ నేతల చేరికల్ని ప్రోత్సహిస్తూనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసేలా ప్రణాళికలు రచించారు. ఏకతాటిపై లేకున్నా పార్టీ మొత్తాన్ని తన ఆధీనంలో తెచ్చుకోవడంలో రేవంత్ రెడ్డి సఫలీకృతుడయ్యాడు. తద్వారా సీఎం అభ్యర్థి తానే అని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.