వైఎస్‌ఆర్‌పై మళ్లీ మళ్లీ అదే తప్పుడు ప్రచారం?
అసలు దీని కథ ఏంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉంది. ఈయనే కాదు చంద్రబాబు ఇతర రాజకీయ నేతలందరూ కూడా జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లో అసైన్డ్ స్థలాన్ని కొనుగోలు చేసి ఇళ్లు కట్టించుకున్నారు. కాంగ్రెస్ సీఎం లు ఎవరూ కూడా వైఎస్ ఇంటి స్థలాన్ని రెగ్యూలర్ చేయలేదు. దీంతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తన స్థలాన్నీ రెగ్యూలర్ చేయమని అర్జీ పెట్టుకున్నారు. ఆ పాయింట్ ని తీసుకొని ఇప్పటికీ కొందరు వైఎస్ పై దుష్ర్పచారం చేస్తూనే ఉన్నారు.
రాజారెడ్డి హయాం నుంచే ఇడుపులపాయలో వేల ఎకరాలు వైఎస్ కుటుంబం పేరిట ఉన్నాయి. వీళ్లు అప్పట్లోనే 26 వేల ఎకరాలను ప్రభుత్వానికి రాసి ఇచ్చేశారు. కానీ ఇప్పటికీ అది వారి చేతుల్లోనే ఉంది. చంద్రబాబు వచ్చిన తర్వాత అక్కడ ఏదో కంపెనీలు ఏర్పాటు చేస్తారని చెప్పారు కానీ ఇప్పటికి నిరుపయోగంగానే ఉంది. అన్నివేల ఎకరాలు ఉండి కూడా ఇల్లు అమ్ముకునే స్థితికి ఎందుకు వెళ్తారు.
గతంలో కాంగ్రెస్ కూడా చంద్రబాబు పై తప్పుడు ప్రచారం చేసింది. అసలు ఆయన అన్నమాటలేంటంటే ఓ రైతుతో మాట్లాడుతూ.. మీ కుటుంబం మొత్తం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోంది కదా.. ఒకరిని ఉద్యోగం వైపు, మరొకరిని సాఫ్ట్ వేర్ రంగంవైపు పంపిస్తే వ్యవసాయం భారం అవదు. అందరూ కలిపి వ్యవసాయం చేస్తే దండగ అవుతుంది కదా అని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ వాళ్లు ఎలాగైతే విష ప్రచారం చేశారో.. వైఎస్ పై కూడా ఇల్లు అమ్ముకునే స్థితికి వెళ్లారు అని ప్రచారం చేశారు.