కేసీఆర్ అంటే ఆ పత్రికలకు అంత వణుకా?
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని కాలువల్లోకి నీరు పంపించుకుని దాన్ని నిల్వ ఉంచుకుంటుంది. రెండో విషయం వాటి ఆధారంగా కొన్ని ప్రాజెక్టులు కట్టబడ్డాయి. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులు ఇలాంటివే.. అట్లాగే ప్రకాశం జిల్లాలోని వెలుగోడు లాంటి ప్రాజెక్టులు మిగులు జలాలను ఉపయోగించుకుందామనే ఉద్దేశంతో నిర్మించినవే. అలాంటిది మిగులు జలాలు ఎంత ఉన్నాయో తెలియక ముందే వాటిని తెలంగాణ రాష్ట్రం ఉపయోగించుకుంటుంది.
అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్మట్టి , నారాయణపూర్ నుంచి లెక్కగట్టిండి అని ఆంధ్రప్రదేశ్ సర్కారు అడుగుతుంది. అయితే అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చే వరకు కొంత వరకు వృథా అయినా వాటి విషయంలో జాగ్రత్తలు వహించాలని అడుగుతోంది. అయితే ట్రిబ్యునల్ మాత్రం కేవలం మిగులు జలాల గురించి మాత్రమే ఆలోచిస్తారు. జగన్ దగ్గర నుంచి లంచం తీసుకుని కేసీఆర్ ఎదురుతిరగడం లేదని బీజేపీ తెలంగాణ లో అంటున్నారు.
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకుని దీనిపై ఏ మాత్రం కూడా మాట్లాడకుండా ఆంధ్రకు అన్యాయం చేస్తున్నారని టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది. ఇలా చేయడం వల్ల అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతున్నా.. అసలు విషయం పక్కకు పోయి రాజకీయ అలజడి మాత్రం రేగుతోంది.