చంద్రబాబుకు బెయిల్ ఇస్తే రచ్చ రచ్చే?

స్కిల్ కుంభకోణంలో కేసులో ఏసీబీ కోర్టులో కస్టడీ కావాలని సీఐడీ కేసు వేసింది. మరో వైపు చంద్రబాబు నాయుడు కు బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు అడుగుతున్నారు. అయితే ఇప్పుడు వాదనలు వినిపించడం ప్రారంభించారు. ముఖ్యంగా సుప్రీం కోర్టులో వెంటనే తీర్పు వచ్చే అవకాశం లేకపోవడం వాయిదాలు పడుతుండడంతో ఇక్కడి ఏసీబీ కోర్టులోనే తేల్చుకోవాలని టీడీపీ తరఫున ఉన్న న్యాయవాదులు నిర్ణయం తీసుకున్నారు.


కింద కోర్టులో వాదనలు న్యాయవాది దూబె తీసుకుంటున్నారు. సుప్రీం కోర్టులో మాత్రం లోద్రా తన పని తాను కానిస్తున్నారు. అయితే ముందు బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయన పై పెట్టిన కేసు గురించి ఎన్ని వాదనలు కేసులు పెట్టిన ఓకే అని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఇలా చంద్రబాబు నాయుడుకు సంబంధించి సీమెన్స్ కు ఫండ్స్ రిలీజ్ చేసిన దాంట్లో చంద్రబాబు ఒక్కరే కాదని అది క్యాబినెట్ తీసుకున్న నిర్ణయమని వాదనలు వినిపిస్తున్నారు.


కాబట్టి ముందు చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఆ తర్వాత విచారించాలని వాదిస్తున్నారు. మరో వైపు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని, మరిన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు కోరుతున్నారు. సీఐడీ అధికారులు మాత్రం చంద్రబాబుకు బెయిల్ ఇస్తే ఆయన సాక్ష్యాలను తారుమారు చేస్తారని, సాక్షులను బెదిరింపులకు గురి చేసే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తున్నారు.


చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసారథి అనే ఇద్దరు విదేశాలకు పారిపోయారు. అయితే వారిద్దరిని విచారిస్తే మరిన్ని నిజనిజాలు తెలుస్తాయని సీఐడీ వాదనలు వినిపిస్తోంది. అయితే వారిని కావాలనే విదేశాలకు పంపించేశారని ప్రభుత్వం తరఫున లాయర్లు వాదిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు బయటకు వస్తే వారిపై తన ప్రభావం చూపించే అవకాశం ఉందని కాబట్టి బాబుకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఈ కేసులో ముందుగానే జీఎస్టీ డొల్లకంపెనీల బాగోతం బయటపెట్టారని వాదనలు వినిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: