పంజాబీ సిక్కులను వాడుకుంటున్న టెర్రరిస్టులు?

ఏ దేశానికి వెళ్లినా.. ఎక్కడ ఉన్నా సిక్కు మతస్తులు తమ సంస్కృతి సంప్రదాయాలను ఏ మాత్రం మరిచిపోరు. విడిచిపెట్టరు. విదేశాల్లో స్థిరపడి ఉన్నత స్థానంలో ఉన్నా సరే వారి మూలాలను వదలరు. ఈ కట్టుబాట్ల నేపథ్యంలో తమకు ప్రత్యేక గుర్తింపు కేటాయించాలని సిక్కులు ఆందోళన చేస్తున్నారు.  ప్రత్యేక ఉర్దూ దేశంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.

2011లో జనాభా లెక్కల ప్రకారం కెనడా జనాభా 3.70 కోట్లు. ఇందులో 16 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఇది కెనడా జనాభాలో 4 శాతం. దాదాపు 7,70,000 మంది సిక్కులు అక్కడ నివాసం ఉంటున్నారు. గడిచిన 20 ఏళ్లలో సిక్కు జనాభా దాదాపు రెండింతలు పెరగారు. ఎక్కువగా పంజాబ్ నుంచి కెనడాకు వలస వెళ్లి అక్కడే స్థిర పడుతున్నారు. దీంతో అక్కడ ఖలీస్థానీలు ఓ తెలివైన ఎత్తుగడ వేశారు.  ఇప్పుడున్న యువతలో ప్రత్యేక ఖలీస్థానీ అంశాన్ని బాగా చొప్పించి వీళ్లను పావులుగా వాడుకుంటున్నారు.

అక్కడ స్థిరపడ్డ వారి భార్యలను కావొచ్చు, పిల్లలను కావొచ్చు విడాకులు తీసుకున్నట్లుగా రికార్డులు సృష్టిస్తున్నారు. ఆ తర్వాత పంజాబ్ లో ఉన్న సిక్కు కుర్రాళ్లకు వీళ్లను ఇచ్చి వివాహం జరిపిస్తున్నారు. ఆ తర్వాత కెనడా తీసుకెళ్లి ఆ దేశ పౌరసత్వం ఇప్పిస్తున్నారు. మళ్లీ అతనికి విడాకులు ఇస్తున్నారు. దీంతో అతను తప్పని పరిస్థితుల్లో అక్కడే స్థిరపడాల్సి వస్తోంది.

పంజాబ్‌లో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడి యువత ఎక్కువగా కెనడా వలస  వెళ్తుంటారు. విడాకులు తీసుకున్న యువత చేత కారు డ్రైవింగ్, ఇతరత్రా చిన్న ఉద్యోగాలు చేపిస్తుంటారు. అలా ఉద్యోగాలకు వచ్చిన వాళ్లు, విడాకులు తీసుకున్న వాళ్లు ఈ తీవ్రవాద నాయకులు చెప్పిన మాటలు వినాలి. లేకుంటే తప్పుడు పాస్ పోర్ట్ లు, వీసాల మీద వచ్చావు కాబట్టి అరెస్టు చేయిస్తామని బెదిరిస్తుంటారు. అలా వీళ్ల ఉగ్రవాద కార్యకలాపాలకు పంజాబీ సిక్కులు బలవుతున్నారన్న నిజం తాజాగా బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: