సర్వేలను నమ్ముకుంటున్న జగన్‌.. దెబ్బేస్తాయా?

గతంలో పార్టీకి వీర విధేయుడిగా ఉంటేనో.. లేక పార్టీ ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు ఉంటేనో.. ఆర్థికంగా బలమైన నేతగా ఉంటేనో పార్టీ టికెట్ లభించేంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు సర్వేలదే కీలకపాత్ర. పార్టీ టికెట్ రావాలంటే మా చేతుల్లో ఏం లేదు. సర్వే ఆధారంగా, పార్టీ పనితీరు ఆధారంగా టికెట్లు అని ఆయా పార్టీ ల అధ్యక్షులు తేల్చి చెబుతున్నారు.

అయితే 2014 కి ముందు టీడీపీ సర్వేల వ్యవహారం మాజీ మంత్రి నారాయణ చూశారు.  ఎలాగంటే పార్టీ అభ్యర్థులకు తెలియకుండా జనాల్లో వారికున్న ప్రజాధారణ ఏ విధంగా ఉంది అనేది చంద్రబాబు దగ్గరికి వచ్చేది. దాని ఆధారంగా నిర్ణయం తీసుకొని తగిన ప్రణాళికలు రచించి విజయం సాధించారు. ఆ సమయంలో సర్వే చేసిన ముఖ్య సభ్యులతో చంద్రబాబు సమావేశమై ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీకు తగిన ప్రాధాన్యం ఇస్తా అని చెప్పినట్లు తెలిసింది.

అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లని పట్టించుకోలేదు. మళ్లీ 2019 కి ముందు సర్వే సభ్యులను కలిసి పార్టీ కోసం పనిచేయాలని కోరారు. తొలిసారి కష్టపడి పనిచేసినా గుర్తింపు లభించలేదు అని భావించి ఈసారి టీడీపీ అభ్యర్థుల దగ్గరికి వెళ్లి సర్వే చేసేది మేమే అని చెప్పారు. వాళ్లు తృణమో, ఫణమో ఇచ్చి సర్వే ఫలితాలు అనుకూలంగా మార్చుకున్నారు. దీంతో పార్టీ 23 స్థానాలకు పరిమితమైంది.

ఇప్పుడు ఇదే భయం వైసీపీ నేతలకు పట్టుకుంది. గతంలో  ఐ ప్యాక్ టీం వైసీపీ కోసం పనిచేస్తోంది అని ప్రశాంత్ కిశోర్ ను ఆ పార్టీ నాయకులకు జగన్ పరిచయం చేశారు. వాళ్లు కీలకంగా పనిచేసి పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు సర్వే ఆధారంగా టికెట్లు ఇస్తానని జగన్ తేల్చి చెప్పారు. ఐ ప్యాక్ సభ్యులు వైసీపీ అభ్యర్థులకు తెలుసు కాబట్టి వారు కూడా టీడీపీ వారిలా చేస్తారనే భయం వైసీపీలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: