కెనడాకి డెడ్‌లైన్ పెట్టిన ఇండియా?
ఇండియాలో ఎక్కడెక్కడ విధ్వంసాలు చేశారు. ఎక్కడ ఉండేవారు. ఎవరిని చంపారు. ఎవరి నుంచి డబ్బులు లాక్కున్నారు. ఇలా ప్రతి విషయాన్ని క్లుప్తంగా ఆధారాలతో సహా కెనడా ప్రభుత్వానికి అందించారు. అయితే ఈ ఆధారాలు ఇచ్చినప్పటికీ కెనడా ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. ఏ మాత్రం సహాయం చేయకుండా ఇంకా హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత ఎజెంట్లు హత్య చేశారనే ఆరోపణలు చేసింది కెనడా.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ విషయంలో పార్లమెంట్ లో భారత్ ఏజెంట్లు కెనడా దేశ పౌరుడిని చంపారని ఇది నేరమని అన్నారు. అసలు కెనడాలో ఉన్న వారికి ఇండియాలోని ఖలిస్తాన్ అనే పేరుతో వేర్పాటు వాద ఉద్యమం చేస్తుంటే ఇన్ని రోజులు నోరు మెదపని వారు కూడా ఒక ఉగ్రవాదిని ఎవరో దుండగులు మట్టుబెడితే దానికి భారత ఏజెంట్లే చంపారని గగ్గోలు పెడుతుంది.
అలాంటి ఉగ్రవాదులు ఎంతమంది కెనడాలో జీవిస్తున్నారు. ఖలిస్తాన్ వేర్పాటు వాద ముసుగులో భారత్ లో ఎక్కడ విధ్వంసాలకు పాల్పడ్డారు. వారు కెనడాలో ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారు. ఏ కంపెనీలో ఉన్నారు.. వారికి నిధులు ఎక్కడి నుంచి సమకూరుతున్నాయి. ఎంతమంది తీవ్రవాదులు స్వేచ్చగా తిరుగు తున్నారు. ఇలా చాలా మంది ఉగ్రవాదుల లిస్టును కెనడాకు భారత ప్రభుత్వం అప్పగించింది. అయినా కెనడా దానిపై స్పందించలేదు. ఇలా ఎన్నో రోజుల నుంచి కెనడాలో ఇండియాకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యకలాపాలను చూస్తుందే కానీ అరికట్టే చర్యలు తీసుకోవడం లేదు.