రిజర్వేషన్ల పొడిగింపుపై న్యాయపోరాటం?
అయితే దీని గురించి ఈ మధ్య ఓ విషయం బయటకొచ్చింది. ముఖ్యంగా చట్ట సభల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పరిశీలిస్తామని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అయితే లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పదేళ్లకు మించి రిజర్వేషన్లు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ ను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. దీనిపై నవంబర్ లో మళ్లీ విచారణ జరుపుతామని తెలిపింది.
చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ కోటాను మరో పదేళ్ల పాటు పొడిగించిన 104 రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలిస్తామని తెలిపింది. దీనిలో సీజేఐ నేతృత్వంలోని అయిదుగురు ధర్మాసనం పేర్కొంది. రాజ్యాాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు పూర్తి కావడంతో ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లు ముగిశాయి. అయితే 104 రిజర్వేషన్ తో తెచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎంతవరకు వర్తిస్తాయో తేల్చాలని ఫిటిషనర్ల న్యాయవాది కోరడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
అయితే స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా ఇప్పటిదాకా పాలనలో ఆంగ్లో ఇండియన్ల సహకారం పార్లమెంట్, అసెంబ్లీలు తీసుకున్నాయంటే కాస్త ఆశ్చర్యం మానక తప్పదు. ఇన్ని రోజులు కూడా ఇంగ్లీషు వారు భారత చట్టసభల్లో ఉన్నారంటే బలమైన చట్టాలే నిర్మించుకున్నారు.