తలపట్టుకుంటున్న బాలయ్య, పవన్ నిర్మాతలు?
ఇక పార్టీల విషయానికొస్తే సినీ రంగం నుంచి వచ్చి రాజకీయ నేతలుగా ఎదిగి విజయం సాధించిన వారు తెలుగునాట ఒక్క ఎన్టీఆర్ ఒక్కరే. చిరంజీవి కూడా ప్రజారాజ్యం పెట్టి జనాల్లోకి వచ్చినా నిలబడలేకపోయారు. మళ్లీ సినిమాలకే పరిమితమయ్యారు. కొంతమంది సినీ నటులు ఏదో ఒక రాజకీయ పార్టీ ద్వారా విజయం సాధించారు కానీ ప్రజాక్షేత్రంలో ఉండలేకపోయారు.
ఇటు సినిమాలు చేస్తూ, మరోవైపు రాజకీయం చేస్తున్న వారిలో టాలీవుడ్ నుంచిపవన్ కల్యాణ్ బాలకృష్ణలు మాత్రమే ఉన్నారు. తమిళనాట ఉదయనిధి స్టాలిన్ సినిమాలు చేస్తున్నా.. ఇక నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉంటానని ప్రకటించారు. మారిన రాజకీయ పరిణామాలు పవన్, బాలయ్య సినిమాలపై ప్రభావం చూపనున్నాయి. ప్రస్తుతం పవన్ చేస్తున్న ఉస్తాద్ భగత్, బాలయ్య నటిస్తున్న భగవంత్ సింగ్ కేసరీ సెట్లపై ఉన్నాయి.
మరో నెల నుంచి 40 రోజులు వీరి సినిమాలకు కాల్షీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే పవన్ సినిమాలకు ఏపీలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతోపాటు వీరిద్దరి డేట్లు ఎప్పడు లభిస్తాయో కచ్చితంగా చెప్పలేరు. అప్పటివరకు భారీగా పెట్టుబడి పెట్టిన నిర్మాతలు సినిమాలు ఆలస్యం కావడంతో నష్టపోతున్నారు. వేరే సినిమా తీయలేక డైరెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇది వారికి ప్రతికూలాంశం.
పవన్, బాలయ్య సినిమాలు వల్ల నిర్మాతలు ప్రభుత్వం కల్పించే రాయితీలు, ప్రత్యేక ప్రదర్శనలు కోల్పోక తప్పదు. దీనివల్ల నిర్మాతలు కొంత నష్టపోయినా వీరితో సినిమాలు తీయడానికి కారణం. ఒక్క ఇండస్ర్టీ హిట్ ఇచ్చారంటే చాలు. రెండింతల లాభం వస్తుంది. యావరేజ్ అయినా సరే పెట్టిన పెట్టుబడికి ఢోకా ఉండదనే భరోసా.