మేమే గ్రేట్‌ అని విర్రవీగేవారు ఓసారి ఇది చదవండి! E

దేనికైనా కాలం కలిసి రావాలి అంటుంటారు. మన సమయం బాగా లేనప్పుడు తాడే పామై కరుస్తుందంటుంటారు. రాజభోగాలు అనుభవించిన వారు కూడా ఒకానొక సమయంలో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. ఏది ఏమైనా కాలనుగుణంగా మన పని మనం చేసుకుంటూ ఇతరులను గౌరవిస్తూ ముందుకు సాగుతుండాలి. అంతే తప్ప మన ప్రస్తుత పరిస్థితికి ఎవరినీ నిందించకూడదు.


కాలమహిమ ఎలా ఉంటుందంటే.. తెలుగు ప్రజలు ఆరాధించే ఎన్టీఆర్ తన చివరాంకంలో అతని పిల్లలు  పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2009లో ఎన్నికల ప్రచారంలో మెగస్టార్ చిరంజీవిపై కోడిగుడ్లు దాడి ఎవరూ ఊహించనటువంటిది. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు బోనులో నిలబడాల్సి వచ్చింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఎలా చనిపోయారో మనందరికీ తెలిసిందే.  ఎన్నో సంస్కరణలు చేపట్టిన ఇందిరాగాంధీని పార్లమెంటే జైలుకు పంపింది. ఆంధ్ర బిల్గేట్స్ సత్యం రామలింగరాజు, ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి జైలు శిక్ష అనుభవించిన వారే.


గొప్ప విజన్ ఉన్న నాయకుడిగా పేరొందిన చంద్రబాబు ప్రస్తుతం రిమాండ్లో  ఉన్నారు. అప్పట్లో చంద్రబాబు అపాయిట్మెంట్ కోసం ఎదురుచూసిన సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ప్రస్తుతం ఏ స్థానంలో ఉన్నారో మనం గమనిస్తూనే ఉన్నాం. చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లగా ఉంటాయి. కాబట్టి నేనే అనే అహంకారంతో విర్రవీగవద్దు. నేనే గొప్ప. నేను చేసిందే కరెక్టు. నా వల్లే ఇదంతా అనే భావం వద్దు. ఈ భూమిపై ఎవరూ శాశ్వతం కాదు. అందరూ అరువుగా వచ్చాం. తర్వాత ఎరువుగా మారతాం. ఎవరు ఎప్పడు ఎలా మారతారో ఊహించలేం. ఎవరితో ఎంత వరకు ఉండాలో అంత వరకే వ్యవహరించాలి.


మనం ఎన్ని కోల్పోయిన మన కోసం ఒకటి ఎదురుచూస్తూ ఉంటుంది. దాని పేరే భవిష్యత్తు. ఒకరి  జీవితం మరొకరికి అందంగానే కనిపిస్తుంది. కానీ జీవితంలో దాగి ఉన్న కష్టాలు కన్నీళ్లు ఎవరికీ కనిపించవు. మనం మనిషిగా పుట్టడమే అదృష్టం. ముడిపడుతున్న బంధాలు వరాలు,  ఎదురుపడుతున్న సవాళ్లు విలువైన పాఠాలు.  కష్టసుఖాలు జీవితంలో  భాగాలు. కాబట్టి వాటి గురించి ఆలోచించకుండా ఉన్న ఈ ఒక్క జీవితాన్ని ఆనందంగా గడిపేద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: