విడ్డూరం: బాబు అవినీతి చేసినా.. తప్పుకాదట?
అంటే జగన్ పై కావాలని కేసులు పెట్టినట్టుగా తెలుస్తుంది అని అంటున్నారు వాళ్లు. ఇంకో విషయం ఏంటంటే 6శాతం కమిషన్ తీసుకుని కాంట్రాక్టులు ఒప్పుకోవడం అనే విషయాన్ని రాధాకృష్ణ హైలెట్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఇలా తీసుకున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు అన్నాడంటే, దాని అర్థం కమిషన్ తీసుకోవడం తప్పుకాదు అని ఇండైరెక్ట్ గా చెప్పినట్లే. అంటే చంద్రబాబు నాయుడు కమిషన్ తీసుకోవడం తప్పుకాదని ఆయన చెప్తున్నట్లే అని కొంతమంది భావిస్తున్నారు.
కేసుల్లో ఇరుక్కోకూడదు అని గతంలో చంద్రబాబు నాయుడు కొంత బెరుకు స్వభావాన్ని ప్రదర్శించారని, ఇప్పుడు ఈ విధంగా కేసు పెట్టడం వల్ల ఆ బెరుకు కూడా పోతుందని ఆయన చెప్పడం జరిగింది. తద్వారా చంద్రబాబునాయుడు ఎదురుదాడి చేస్తారు అని ఆయన చెప్పుకొచ్చాడట. 100కోట్ల పైబడిన ఏ కాంట్రాక్టుకైనా గ్లోబల్ టెండర్ పిలిచి ఇవ్వాలి. కానీ సీమన్స్ సంస్థను అడ్డుపెట్టుకుని ఏ విధంగా ఇచ్చేశారు.
అసలు సీమన్స్ సంస్థ మొన్న తేల్చి చెప్పేసింది డిజైన్ టెక్ కూ, మాకు సంబంధం లేదని. సీమన్స్ సంస్థలో పనిచేసిన వాడే బయటికి వచ్చి డిజైన్ టెక్ పెట్టుకున్నాడట. ఇదంతా అవినీతిలో భాగం కాదంటారా ఆర్కే గారు అని జనాలు అడుగుతున్నారు ఇప్పుడు రాధాకృష్ణని. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా కూడా ఆయన తేల్చి చెప్పేది ఒకటే. చంద్రబాబు నాయుడు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ చేసేదంతా అవినీతేనని ఆయన తేల్చి చెప్తున్నట్లే.