జగన్‌కు షాక్‌ ఇచ్చిన పీకే సర్వే.. అందుకే బాబు అరెస్ట్‌?

జగన్‌ కు ఇటీవల పీకే ఇచ్చిన సర్వే రిపోర్టు షాక్ ఇచ్చిందట. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దాదాపు 15 లోక్‌సభ సీట్లలో వైసీపీ ఓడిపోబోతోందట. ఆ రిపోర్టు చూసి షాక్ అయిన జగన్.. ఎలాగైనా టీడీపీ దూకుడుకు కల్లెం వేయాలనే చంద్రబాబును అరెస్టు చేయించారట. ఇదంతా హిందుస్థాన్ టైమ్స్ కి సంబంధించిన నేషనల్ పొలిటికల్ ఎడిటర్ సునేత్ర చౌదరి చెబుతున్న వాదన. సునేత్ర  తన కెరీర్‌ని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మ్యాగజైన్ లో ప్రారంభించింది. మూడు సంవత్సరాల తర్వాత ఆమె ఎన్డీటీవీ కోసం  పని చేయడం మొదలు పెట్టింది.


2009ఎన్నికల ప్రచారం తర్వాత, ఆమె బ్రేకింగ్ న్యూస్ రాసింది. ఆమె ప్రింట్, టెలివిజన్‌ రంగంలో రెండు దశాబ్దాల అనుభవం కలిగి ఉంది. అలాగే సునేత్ర చౌదరి బ్లాక్ వారెంట్, బిహైండ్ బార్స్: ప్రిజన్ టేల్స్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ ఫేమస్, బ్రేకింగ్ న్యూస్ అనే రచనలు చేసింది. జర్నలిజంలో  2016లో  రెడ్ ఇంక్ అవార్డును, 2018లో మేరీ మోర్గాన్ హెవెట్ అవార్డును అందుకున్నారు సునేత్రా.


అయితే.. చంద్రబాబుకు ఇన్ కమ్ టాక్స్ శాఖ ఇచ్చిన నోటీసుల గురించి ఇంతకు ముందు ఒక జర్నలిస్ట్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సునేత్ర చౌదరి 25లోక్ సభ స్థానాల్లో 16లోక్ సభ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని,  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐపాక్ టీం చెప్పిందని ఆ పార్టీ ఆంతరంగికులు చెప్పారని ఆవిడ చెప్పారట.


సర్వే ఫలితాలతోనే  ఈ పరిస్థితి వచ్చిందని భయపడి చంద్రబాబు  పై చర్యలు తీసుకున్నట్లుగా సందేహం వస్తుందని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది. దీని ప్రభావం ఎన్నికలపై పడుతుందని, రాబోయే ఎన్నికల్లో  జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని ప్రశాంత్ కిషోర్  ఆమెతో చెప్పారని ఆమె చెప్పడం జరిగింది. మరో పక్కన ఆమె క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పడం జరిగింది. ఈ వ్యతిరేకత వల్లే జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని అంటుంది ఆవిడ. అయితే ఒక చోట ఆమె ఈ మాటలు ప్రశాంత్ కిషోర్ తన అనుచరులకు చెప్పాడని, ఆ అనుచరులు తనకు చెప్పారని చెప్పడం జరిగింది. మరో చోట తనతో ప్రశాంత్ కిషోర్ ఈ విషయాలన్నీ చెప్పాడని చెప్పడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: